Mthun Chakraborty : లెజండరీ యాక్టర్.. మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mthun Chakraborty : ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తికి ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. ఈ అవార్డుకు ఎంపిక చేసేందుకు ఏర్పాటైన జ్యూరీ ఆయన పేరును సిఫారసు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. అతను తన అధికారిక X ఖాతాలో సమాచారాన్ని పోస్ట్ చేశాడు. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు మిథున్ చక్రవర్తి చేసిన సేవలను దృష్టిలో ఉంచుకుని దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఆయన పేరును జ్యూరీ సిఫార్సు చేసింది. అక్టోబరు 8న జరగనున్న 70వ జాతీయ చలనచిత్రోత్సవ అవార్డుల ప్రదానోత్సవంలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.
Read Also:Fraud: ప్రముఖ పారిశ్రామికవేత్తను మోసం చేసిన కేటుగాళ్లు.. ఏకంగా రూ.7కోట్లు
Also Read
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
Mithun Da’s remarkable cinematic journey inspires generations!
Honoured to announce that the Dadasaheb Phalke Selection Jury has decided to award legendary actor, Sh. Mithun Chakraborty Ji for his iconic contribution to Indian Cinema.
🗓️To be presented at the 70th National…
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) September 30, 2024
ఈ అవార్డుకు ఎంపికైనందుకు అశ్విని వైష్ణవ్ అభినందనలు తెలిపారు. కోల్‌కతా వీధుల్లోంచి సినిమా పతాక స్థాయికి చేరుకున్నాడని చెబుతారు. భవిష్యత్తులో మరిన్ని ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు. మిథున్ చక్రవర్తి ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. నాలుగేళ్ల కిందటే భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయన తన సొంత రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. మిథున్ చక్రవర్తి 1976లో మృగయ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. అతను తెలుగు, తమిళం, కన్నడ, పంజాబీ, ఒరియా, భోజ్‌పురి వంటి దాదాపు అన్ని భారతీయ సినిమాల్లో నటించాడు. తెలుగులో టర్న్, గోపాల గోపాల, తమిళంలో యాగవరైయునుం నా కక్క, కన్నడలో ది విలన్ వంటి సినిమాల్లో మెరిశారు. నటుడిగా, నిర్మాతగా ఆయన విశిష్ట సేవలందించారు. ‘డిస్కో డాన్సర్’ చిత్రం ద్వారా భారీగా ప్రేక్షకాదరణ పొందారు. ఇప్పటికే పలు అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. ఇక సినీ రంగంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్రం ఈ ఏడాది ఆయనకు పద్మభూషణ్ అవార్డును కూడా అందజేసింది.
Read Also:Janvi Kapoor : ఐఫాలో జాన్వీ పాప వేసుకున్న నెక్లెస్ ఎన్ని కోట్లో తెలుసా ?
తాజావార్తలు
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!