Site icon NTV Telugu

MISS WORLD-2025: నేడు మరో మూడు దేశాల మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ రాక

Misswords

Misswords

మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాలకు చెందిన కంటెస్టెంట్స్ హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఇవాళ పోర్చుగల్, ఘనా, ఐర్లాండ్ దేశాలకు చెందిన ప్రతినిధులు శంషాబాద్ రానున్నారు. వీరికి పూర్తి సంప్రదాయ లాంఛనాలతో స్వాగతం పలికేందుకు పర్యాటక శాఖ ఏర్పాట్లు చేసింది. స్వాగత సత్కారాలతో పాటు, భద్రత, వసతికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. పోర్చుగల్ కు చెందిన మారియా అమెలియా ఆంటోనియో, ఘనా నుంచి జుట్టా అమా పోకుహా అడ్డో, ఐర్లాండ్ కు చెందిన జాస్మిన్ జెర్హార్డ్ లు హైదరాబాద్ చేరుకుంటారు.

Also Read:Terrorist: పోలీసుల నుంచి తప్పించుకోబోయిన లష్కరే తోయిబా స్లీపర్ సెల్.. చివరకు ఏమైందంటే..?

ఇప్పటికే,మిస్ సౌత్ ఆఫ్రికా జోయలైజ్ జన్సెన్ వాన్ రెన్స్ బర్గ్ , మిస్ బ్రెజిల్ జెస్సికా స్కేన్ద్రియుజ్య్ పెడ్రోసో ( Ms. Jessica Scandiuzzi Pedroso (Brazil), మిస్ వరల్డ్ సీఈవో, చైర్ పర్సన్ జూలియా ఈవేలిన్ మోర్లి, మిస్ కెనడా మిస్ ఎమ్మా డయన్నా క్యాథరీన్ మొర్రిసన్ లు ఇప్పటికే చేరుకున్నారు. అత్యధిక కంటెస్టెంట్లు 7 వ తేదీ నుంచి హైదరాబాద్ కు చేరుకోనున్నారు. ఈనెల 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగే ప్రారంభ కార్యక్రమంపై మిస్ వరల్డ్ చైర్ పర్సన్ జూలియా మోర్లీ సన్నాహక, సమన్వయ కార్యక్రమాలను ప్రభుత్వ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.. మిస్ వరల్డ్ పోటీల నేపధ్యంలో హైదరాబాద్ ముస్తాబవుతుంది. కంటెస్టెంట్స్, ప్రతినిధులకు భారీ బందోబస్తు మధ్య భద్రతను ఏర్పాటు చేశారు. ఈ నెల 10 న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగబోయే కార్యక్రమంతో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కానున్నాయి.

Exit mobile version