అనుష్క నటించిన లేటెస్ట్ సినిమా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి.దాదాపు మూడేళ్ళ విరామం తరువాత అనుష్క ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది, ఈ సినిమా లో హీరోగా జాతి రత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి నటించారు. ఈ సినిమాకు మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీని ముందుగా ఆగస్ట్ 4 న విడుదల చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ప్రకటించింది. ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కొంత బ్యాలెన్స్‌గా ఉండటం తో విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.కొత్త విడుదల తేదీని త్వరలోనే వెల్లడిస్తామని వారు అనౌన్స్ చేశారు. కానీ రెండు వారాలైన ఇప్పటి వరకు విడుదల పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
ఈ సినిమాను ఆగస్ట్ 18 లేదా 25ల లో ఏదో ఒక తేదీ న విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కొన్ని వార్తలు వినిపించాయి. కానీ ఈ తేదీలలో పలు పాన్ ఇండియన్ మూవీస్ లైన్‌లో ఉండటంతో ఈ సినిమా సెప్టెంబర్ కు షిఫ్ట్ అయినట్లు సమాచారం.సెప్టెంబర్ 8న మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా సోలో రిలీజ్ కోసం చూస్తూ సినిమా విడుదల ను సెప్టెంబర్ 8న ఫైనల్ చేశారని సమాచారం.. మరోవైపు ఈ సినిమా ఫైనల్ అవుట్‌పుట్ విషయం లో మేకర్స్ కొంత అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది..దీనితో కొన్ని రీషూట్స్ కూడా జరుగుతున్నట్లు సమాచారం.అందువల్లే సినిమా విడుదల తేదీలో మార్పు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.ఈ సినిమా లో అనుష్క చెఫ్ క్యారెక్టర్‌లో నటిస్తోండగా నవీన్ పొలిశెట్టి స్టాండప్ కమెడియన్‌గా కనిపించబోతున్నాడని తెలుస్తుంది.సినిమాలో వీరిద్దరి కాంబినేషన్ కి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ కూడా ప్రేకక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మరి ఈ సినిమా విడుదల తరువాత ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి..