Site icon NTV Telugu

Miss Perfect Teaser : లావణ్య త్రిపాఠీ, అభిజీత్, హాట్ స్టార్ స్పెషల్స్ “మిస్ పర్ఫెక్ట్” టీజర్ రిలీజ్…

Miss Perfect

Miss Perfect

మెగా కోడలు లావణ్య త్రిపాఠీ పెళ్లి తర్వాత వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇక పెళ్లి తరువాత కూడా ఇండస్ట్రీలో కొనసాగుతాను అని తెలియజేసిన లావణ్య.. ఇప్పుడు బ్యాక్ టు వర్క్ వచ్చేశారు. ఓ తమిళ్ సినిమాలో నటిస్తున్న లావణ్య.. ‘మిస్ పర్ఫెక్ట్’ అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ టీజర్ ని రిలీజ్ చేశారు…ఈ వెబ్ సిరీస్ లో లావణ్య త్రిపాఠీ, అభిజీత్ దుద్దాల, అభిజ్ఞ ఉతలూరు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. “మిస్ పర్ఫెక్ట్” వెబ్ సిరీస్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇవాళ ఈ వెబ్ సిరీస్ టీజర్ ను రిలీజ్ చేశారు.

“మిస్ పర్ఫెక్ట్” టీజర్ చూస్తే.. తాను చేసే ప్రతి పనిలో, తన చుట్టూ ఉన్న ప్రతి విషయంలో పర్ఫెక్షన్ కోరుకునే యువతిగా లావణ్య కనిపించింది. ఆమె పొరుగింట్లో ఉండే కుర్రాడు అభిజీత్ కూడా ఇలాగే ప్రతి పని పర్ఫెక్ట్ గా చేయాలనుకుంటాడు. వీళ్లిద్దరి ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ చుట్టూ అల్లుకున్న హిలేరియస్ ఎంటర్ టైనింగ్ కథే “మిస్ పర్ఫెక్ట్” వెబ్ సిరీస్ అని టీజర్ తో తెలుస్తోంది. త్వరలో డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది..

నటీనటులు – లావణ్య త్రిపాఠి, అభిజీత్ దుద్దాల, అభిజ్ఞ ఉతలూరు, ఝాన్సీ, హర్షవర్థన్, మహేశ్ విట్ట, హర్ష్ రోషన్ తదితరులు

Exit mobile version