Terror Attack: బెల్జియంలోని బ్రస్సెల్స్ సౌత్ రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి అకస్మాత్తుగా వచ్చి ప్రయాణికులపై కత్తితో దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన సీసీటీవీ రికార్డింగ్‌ను పరిశీలించి విచారణ జరుపుతున్నారు.
Lottery: రాత్రికి రాత్రే ‘కోటీశ్వరుడు’.. 88 ఏళ్ల వృద్ధుడికి రూ.5కోట్ల జాక్‌పాట్
బ్రస్సెల్స్-సౌత్ స్టేషన్‌లో కూర్చున్న వివిధ ప్రయాణికులపై ఒక యువకుడు దాడి చేశాడు. ప్రయాణికులపై దాడి చేసేటప్పుడు అతను ‘అల్లా హు అక్బర్’ అని నినాదాలు చేసాడు. వైరల్ అయిన వీడియో ప్రకారం.. నల్ల జాకెట్ ధరించిన వ్యక్తి మొదట తన బ్యాగ్‌ని నేలపై ఉంచి, స్టేషన్‌లో కూర్చున్న మరో వ్యక్తి వద్దకు అకస్మాత్తుగా పరుగెత్తాడు. ఆ దుండగుడు ఆ వ్యక్తిని కత్తితో కొట్టడం వీడియోలో చూడవచ్చు. ఆ వ్యక్తి లేచి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ దుండగుడు ఇతరులపై కూడా కత్తితో దాడి చేశాడు.బాధితులెవరూ తీవ్రంగా గాయపడలేదని తెలిసింది. ఈ విషయంపై పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్న తర్వాత మరింత సమాచారం వెల్లడి కానుంది.
https://twitter.com/MeghUpdates/status/1615796947289538560?ref_src=twsrc%5Etfw
