Site icon NTV Telugu

Minor’s Marriage with Dogs: చిన్నారులకు శునకాలతో పెళ్లి.. బాలుడికి ఆడకుక్కతో.. బాలికకు మగ కుక్కతో..!

Dogs

Dogs

Minor’s Marriage with Dogs: చిన్నారులకు వీధి కుక్కలతో వివాహం జరిపించారు.. అదేంటి? కుక్కలతో పెళ్లి ఏంటి? అనే అనుమానం వెంటనే రావొచ్చు.. నిజమే ఒడిశాలో జరిగిన ఈ ఘటన వైరల్‌గా మారిపోయింది.. ఇంతకీ వీధి కుక్కలతో పెళ్లి చేయాల్సిన అవసరం ఏమి వచ్చిందనే వివరాల్లోకి వెళ్తే.. అదో నమ్మకం.. మూఢనమ్మకం.. ఎందుకంటే.. ఓ వైపు ఆధునిక పరిజ్ఞానంలో దూసుకెళ్తుంటే.. మరోవైపు.. ఇలాంటి నమ్మకాలు కూడా అదేస్థాయిలో పెంచిపోషిస్తున్నవారు లేకపోలేదు.. మొత్తంగా ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఇద్దరు మైనర్ పిల్లలకు ‘దుష్టశక్తులను దూరం చేసేందుకు’ వీధికుక్కలతో పెళ్లి చేశారు. 11 ఏళ్ల బాలుడు తపన్ సింగ్ (దారీ సింగ్ కుమారుడు) ఆడ కుక్కను వివాహం చేసుకోగా, ఏడేళ్ల లక్ష్మి (బుటు కుమార్తె) ఒక మగ కుక్కతో వివాహం చేసుకుంది. ఇది స్థానికుల నమ్మకం ప్రకారం. దుష్టశక్తులను దూరం చేస్తుందన్నమాట.

Read Also: Mulapeta Greenfield Port: ‘మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్ట్‌’కి సీఎం జగన్‌ శంకుస్థాపన

ఒడిశాలోని హో తెగకు చెందిన గిరిజనులు తమ పిల్లల దవడలపై దంతాలు కనిపించడం అశుభంగా భావిస్తారట.. అయితే, కుక్కలతో పెళ్లి చేస్తే వారి నుంచి దుష్టశక్తులు పారిపోతాయని వారి నమ్మకం.. ఇది సంప్రదాయాల ప్రకారం జరిగే తంతు అని.. కుక్కలతో వివాహాలు ఇలా జరుగుతూనే ఉంటాయని గ్యాడ్యుయేట్ అయిన 28 ఏండ్ల సాగర్ సింగ్ తెలిపాడు.. కుక్కలతో పెళ్లి నిశ్చయమైన తర్వాత.. ఆ చిన్నారులకు జరిగే చెడు కుక్కలకి వెళ్లిపోతుందని స్థానికుల నమ్మకంగా చెప్పుకొచ్చాడు. “సమాజ సంప్రదాయాల ప్రకారం, రెండు ‘వివాహాలు’ జరిగాయి.. విందుతో పాటు ఉదయం 7 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు ఆచారాలు కొనసాగాయి” అని సాగర్‌ వెల్లడించాడు.. అయితే, ఏదైనా వెరైటీగా కనిపిస్తే.. ఇట్టే సోషల్‌మీడియాలో వైరల్‌ చేసే నెటిజన్లకు ఇప్పుడు కుక్కలతో చిన్నారుల పెళ్లికి సంబంధించిన న్యూస్‌, ఫొటోలు, వీడియోలు దొరకడంతో.. వైరల్‌గా మారిపోయింది.

Exit mobile version