Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపును మంత్రులు నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత పరిశీలించారు. ఇంజనీర్లను బోట్ల తొలగింపు ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రులు. జరిగిన బోటు తొలగింపు విధానాలను హోంమంత్రి వంగలపూడి అనితకి వివరించారు నిమ్మల. ఈ సంద్రాభంగా హోమ్ మంత్రి మాట్లాడుతూ.. జత్వానీ కేసులో ఎవరినీ బలిపశువులను చేయడం లేదు., గత ప్రభుత్వంలో బలి పశువులను చేసారు. బోట్ల తొలగింపుకు అన్నిరకాల సహకారం అందిస్తాం. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను వినియోగించుకోవచ్చు. అనలిస్టులు టీవీల ముందు మాట్లాడేప్పుడు ఆలోచించాలి. వందల బోట్లు కట్టేసి ఉంటే ఈ మూడే ఎందుకొచ్చాయని వ్యాఖ్యానించారు.
Nara Lokesh: ఉండవల్లిలో ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి నారా లోకేష్..
ఇక జలవనరులశాఖమంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. ఇంజినీర్లు తీవ్రంగాశ్రమిస్తున్నా బోట్లు భారీగా ఉండటంతో బోటు బయటకు రావడం లేదు., తొలుత క్రేన్లతో, ఎయిర్ బెలూన్లతో లేపేందుకు యత్నించినా ఫలితం రాలేదు. బోట్లు భారీగా ఉండటంతో డైవింగ్ టీంతో కట్ చేసేందుకూ సాధ్యపడటం లేదు. అబ్బులు టీం సైతం పలు విధాలుగా ప్రయత్నించినా బోటు బయటకు రాలేదు. సీఎం చంద్రబాబు, లోకేష్ సమీక్షిస్తూ ఏజన్సీకి పూర్తి స్వేచ్చ ఇచ్చి వెలికి తీయాలని ఆదేశించారని., ఒక్కో బోటు 80-100 టన్నుల బరువు ఉంటుందని నిపుణులు చెప్పినట్లు ఆయన అన్నారు. అధికారులు, ఇంజినీర్లు చేసే కొత్త ప్లాన్ తో ఇవాల బోట్లు వెలికితీత కొలిక్కి వస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.