NTV Telugu Site icon

Vidadala Rajini: చింతమనేనికి మహిళలంటే గౌరవం లేదు

rajini prabha

Collage Maker 24 Apr 2023 12 09 Pm 5783

టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ పై తీవ్రంగా మండిపడ్డారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని పర్యటించారు. రాజమండ్రిలో జరుగుతున్న వైద్య కళాశాల నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి రజని అనంతరం మీడియాతో మాట్లాడారు. చింతమనేనికి మహిళల పట్ల గౌరవంలేదు. తాహశీల్దార్ వనజాక్షి పట్ల ఏవిధంగా వ్యవహరించారో అంతా చూశాం.. మహిళల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంతా మంచిది. మేకప్ వేసుకుని తిరుగుతున్న నేను హాస్పటళ్లను పట్టించుకోవడంలేదని విమర్శించడం టిడిపి నేతలకు తగదు. ప్రభుత్వాసుపత్రులను అభివృద్ధి చేసి వైద్య సేవలు మెరుగుపర్చిన ఘనత జగనన్న ప్రభుత్వానిదే. మే ఒకటి నుండి ప్రైవేట్ హాస్పటల్స్ లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేయకుండా చర్యలు.

ఇప్పటికే ఆరోగ్యశ్రీ బకాయిల చెల్లింపులకు కొంత మేరకు నిధులు విడుదల చేశాం. త్వరలోనే మిగిలిన బకాయిలు చెల్లిస్తాం.ఆరోగ్య శ్రీ సేవలపై ఆందోళన చెందాల్సిన పని లేదు. రాజమండ్రిలో మెడికల్ కాలేజ్ కలను సీఎం జగన్ సాకారం చేస్తున్నారు. సీఎం జగన్ ఏం చేసినా పర్మినెంట్ గా చేస్తారు. చంద్రబాబు పనులన్నీ టెంపరరీ. తమ హయాంలో ఆరోగ్యశాఖకు ఏం చేశారో టిడిపి చెప్పాలన్నారు మంత్రి రజని. చింతమనేని ప్రభాకర్ కు మహిళలపై గౌరవం లేదు… ఎమ్మార్వో వనజాక్షి ఘటనే దానికి నిదర్శనం అన్నారు.

Read Also: Governor Tamilisai: పెండింగ్ బిల్లులపై గవర్నర్ కీలక నిర్ణయం.. ఆ బిల్లును తిరస్కరించిన తమిళిసై

మంత్రి రజని ఈవిధంగా రియాక్ట్ కావడానికి కారణం లేకపోలేదు. చింతమనేని ప్రభాకర్ గురించి పరిచయం అక్కర్లేదు. టీడీపీ హయాలో విప్ గా పనిచేశారు. వివిధ వివాదాల్లో చిక్కుకున్నారు. తాజాగా ప్రభుత్వం తప్పొప్పులను ఎత్తిచూపుతూ నిలదీస్తున్నారు. ఇప్పటికే పలు ప్రజా సమస్యలను లేవనెత్తి పరిష్కార మార్గం చూపించిన చింతమనేని.. తాజాగా ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో సౌకర్యాలు సర్లేవని ఫైర్ అయ్యారు.ఆదివారం చింతమనేని ఏలూరు ప్రభుత్వాసుపత్రిని సందర్శించారు. స్వయంగా ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫోన్ చేసిన చింతమేనని ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ‘ సూపరింటెండెంట్‌గారు నేను అడుగుతున్నానని మీరు బాధపడొద్దు. నేను ప్రజల తరఫున మాత్రమే అడుగుతున్నా.. ఈ విషయాల్లో నేనేమీ రాజకీయాలు చేయట్లేదు.

మీకు కానీ.. మీ ఉద్యోగులకు కానీ జీతాలు ఏమైనా ఆపుతున్నారా..?. ఆస్పత్రికి సంబంధించి ఏ సమస్యలు వచ్చినా జరగవ్ కానీ.. మీకు మాత్రం అన్నీ జరిగిపోతున్నాయ్ కదా. జీతాలు తీసుకుంటున్నప్పుడు ఆస్పత్రిలో మంచి సదుపాయాలు ఎందుకు కల్పించరు..?.ఈ ఆస్పత్రి కోసం ఇప్పటికిప్పుడు ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదు. ఎప్పుడూ లేని ఇబ్బందులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి..?. అసలు ఈ వార్డులు చూడండి ఎలా ఉన్నాయో.. ఒకసారి మీరు వచ్చి గంట కూర్చోని వెళ్లండి.. పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుస్తాయి అన్నారు. పనిలో పనిగా ఆస్పత్రుల్లో ఇంత జరుగుతున్నా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని (Vidadala Rajini) ఏం చేస్తున్నారు..?. మంత్రి మేకప్ వేసుకుని తిరుగుతోందా..? ’ అని మంత్రి రజినిపై చింతమనేని తీవ్ర స్థాయిలోనే ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి ఈవిధంగా స్పందించారు.

Read Also: Simhadri: అతిపెద్ద స్క్రీన్ పై ‘సింహాద్రి’… ఇదెక్కడి ఫ్యాన్ బేస్ రా సామీ

Show comments