Minister Prashanth Reddy: తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి మంత్రి వేముల మంజులమ్మ కన్నుమూశారు. ఆమె అనారోగ్య కారణాలతో హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. కొంత కాలంగా చికిత్స తీసుకుంటూ కాసేపటి క్రితమే మరణించారు. వారి స్వగ్రామం వేల్పూర్ నందు రేపు ఉదయం అంతక్రియలు జరుగుతాయి. వేముల ప్రశాంత్ రెడ్డి రెండు సార్లు బాల్కొండ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రశాంత్ రెడ్డి తల్లి మరణ వార్త విన్న ఆయన అభిమానులు సంతాపం ప్రకటించారు.
సాగు నీటి రంగంలో పునర్జీవం పథకం ద్వారా 300 కిలో మీటర్ల దూరంలోని కాళేశ్వరం జలాలను తెచ్చి ఎస్సారెస్పీలో పోసుకోవడంతో పాటు ప్రాజెక్టు పరిధిలో రైతులకు, బాల్కొండ, ఆర్మూర్ నియోజక వర్గాల్లోని లక్ష్మీ కెనాల్, గుత్ప, చౌట్‌పల్లి హన్మంత్ రెడ్డి, తదితర ఎత్తిపోతల పథకాలకు నీటికి కొదవ లేకుండా చేశారు. ఎస్సారెస్పీకి దూరంగా ఉండే భీమ్‌గల్, మోర్తాడ్, వేల్పూర్, కమ్మర్‌పల్లి మండలాల్లో 80 వేల ఎకరాలకు సాగు నీరందించే ప్యాకేజీ- 21తో కాళేశ్వరం జలాలను తెచ్చి కప్పల వాగులో పారించుకోవడం తనకు ఎనలేని ఆనందాన్ని అందించారు.
Read Also: Salaar: సింపుల్ ఇంగ్లీష్… నో కన్ఫ్యూజన్… డైనోసర్ కి ఎలివేషన్ ఇచ్చిన టిన్నూ ఆనంద్ బర్త్ డే