ఉమ్మడి రాష్ట్రంలో కల్లు దుకాణాలు మూసివేసి గౌడ్స్‌ను ఇబ్బందులకు గురి చేశారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తాజాగా ఆయన మునుగోడు ఉప ఎన్నికకు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాటి పాలకులు దుర్మార్గంగా వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. నాటి పాలకులకు గౌడ్స్ రెగ్యులర్ గా మామూళ్లు ఇచ్చే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడా లేదని ఆయన అన్నారు. గతంలో ఆబ్కారీ శాఖ వాళ్ళు ఎన్నో వేధింపులకు గురి చేశారని, ఇప్పుడు గౌడన్నలు ఎవరికి భయపడడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆత్మగౌరవంతో గౌడన్నలు పనులు చేసుకుంటున్నారని, గౌడ్సే కల్లు గీయాలి, వాళ్లే కల్లు అమ్మాలనే సర్వాయి పాపన్న డిమాండ్ ను తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చుతోందని ఆయన వెల్లడించారు.
Also Read : Minister KTR : రాష్ట్రంలో సింహభాగం భూములు బీసీల చేతుల్లో ఉన్నాయి
హైదరాబాద్ నడిబొడ్డున నీరా కేఫ్ లను ప్రారంభించుకున్నామన్నారు. గౌడ్స్ ను రాజకీయంగా అణిచివేతకు గురి చేశారని, అందుకే చిన్న తాటి చెట్లను కనిపెట్ట లేదని ఆయన అన్నారు. అనంతరం మాజీ కౌన్సిల్ చైర్మన్ స్వామి గౌడ్ మాట్లాడుతూ.. గౌడ కార్మికులు చనిపోయిన తర్వాత చెల్లించే ఎక్స్ గ్రేషియా పెంచాలన్నారు. రైతులకు రైతుబంధు ఇస్తున్నారని, యాదవులకు గొర్రెలు ఇస్తున్నారని, గౌడ్స్ కు ఏమి ఇవ్వడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. గౌడ్స్ చనిపోయిన తర్వాత ఎక్స్ గ్రేషియా ఇస్తున్నారు. అలా కాకుండా గౌడ్స్ కు కొంత ఆర్థిక సహాయం చేయాలన్నారు.