Minister Vanitha: జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారిందని రాష్ట్ర మంత్రి సవిత సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కల్తీ మద్యం పాపానికి జగనే ప్రధాన పాపాత్ముడని ఆమె అన్నారు. కల్తీ మద్యం కారణంగా గత ఐదేళ్లలో 30 వేల మంది తమ ప్రాణాలు కోల్పోగా, 30 లక్షల మంది అమాయక ప్రజలు అనారోగ్యం పాలయ్యారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
Samantha : “నా లైఫ్‌లో ఉన్న ఆ వ్యక్తి గురించి ఇప్పుడేం చెప్పలేను.. కానీ సమయం వచ్చినప్పుడు చెబుతాను”
జగన్ నేతృత్వంలోని బ్యాచ్ లిక్కర్ మాఫియాగా ఏర్పడి ఏకంగా రూ. 3,500 కోట్లు దోచుకుందని మంత్రి సవిత ఆరోపించారు. కల్తీ మద్యం పేరుతో రాష్ట్రంలో అలజడి సృష్టించడానికి తాడేపల్లి ప్యాలెస్ లోనే కుట్రలు జరిగాయని ఆమె పేర్కొన్నారు. ఈ కల్తీ మద్యం ప్రణాళికల తయారీలో ఏ-1 జనార్దన రావు, జోగి రమేష్ కీలకంగా వ్యవహరించారని ఆమె తెలిపారు. కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా, జగన్ బ్యాచ్ ఆఫ్రికా ఖండాన్ని కూడా వదల్లేదని మంత్రి సవిత తెలిపారు. జే బ్రాండ్ పేరుతో ఆఫ్రికాలో కూడా కల్తీ మద్యం విక్రయాలు జరిగాయని ఆమె వెల్లడించారు.
Shocking Viral Video: మహిళలు జాగ్రత్త.. సానిటరీ ప్యాడ్స్‌లో ‘లార్వా’.. వీడియో వైరల్
ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికే అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి సవిత స్పష్టం చేశారు. అందులో భాగంగా కూటమి ప్రభుత్వం బెల్ట్ షాపులపైనా, కల్తీ మద్యం తయారీదారులపైనా ఉక్కుపాదం మోపుతోందని తెలిపారు. సురక్షా యాప్ ద్వారా కల్తీ మద్యం తయారీకి అడ్డుకట్ట వేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే కల్తీ మద్యం తయారీ వెనుక ఉన్న వాస్తవాలను, కుట్రలను ప్రజల ముందు బయటపెడతామని మంత్రి సవిత ప్రకటించారు.
