NTV Telugu Site icon

Minister Roja Vs Janasena: నగరిలో హైటెన్షన్.. రోజాకు జనసేన సవాల్

Roja1 (3)

Roja1 (3)

నగరి నియోజకవర్గంలో రాజకీయాలు గరంగరంగా మారాయి. మంత్రి ఆర్ కె రోజా నియోజకవర్గంలో అభివృద్ధిపై చర్చకు రావాలని జనసేన నేతలు సవాళ్లు విసురుతున్నారు. మేము సింగల్‌గా రావలో.. మూకుమ్మడిగా రావాలో నువ్వు చేప్పాల్సిన అవసరం లేదు.. రోజా సీటే గల్లంతు, ఇక మా గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది.. నగరి నియోజవర్గంలో పార్టీ సమీక్ష పెట్టమంటుంటే ఎందుకు రోజా వెనకడుగు వేస్తున్నారు.

Read Also: Khammam Bike Lift Case Mystery: బైక్‌ లిప్ట్‌ ఘటన ట్విస్ట్.. భార్య ప్లాన్‌ మామూలుగా లేదుగా!!

నగరిలో రోజా శకం ముగిసింది అంటూ జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు. దీనికి ప్రతిగా మంత్రి రోజా కూడా ధీటైన కౌంటర్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. మంత్రి రోజా సవాల్ ను స్వీకరిస్తూ నగరి వెళ్ళడానికి సిద్ధమైన జనసేన నేతలను హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. నగరిలో మళ్ళీ రోజా గెలిచి చూపించాలని అటు టీడీపీ, జనసేన నేతలు అంటున్నారు. నగరిలో అభివృద్ది ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు మంత్రి రోజా.

పోలీసులతో జనసేన నేతల వాగ్వాదం 

ఆ మాట్లాడే వారు దమ్ముంటే మా ఇంటికి రండి. జెండా విలువలు లేని వ్యక్తి వెనుక జనసేన కార్యకర్తలు వున్నారని, వారు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. రోజా ఛాలెంజ్ విసరడంతో నగరికి వస్తున్నామంటూ జనసేన కార్యకర్తలు బయలుదేరారు. అయితే వీరికి పోలీసుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. తమను తన ఇంటికి రమ్మని రోజా సవాల్ విసిరారని, తాము అక్కడికి బయలుదేరిదితే పోలీసులతో హౌస్ అరెస్టు చేయించిన రోజాపై జనసేన నేతలు ఫైర్ అవుతున్నారు. నగరి నియోజక వర్గంలో ఒకశాతం అభివృద్ధి జరగలేదు… అ భయంతోనే మా పర్యటన అడ్డుకుంది…నోటికొచ్చినట్లు మాట్లాడటం కాదు… మాట మీద నిలబడాలి అంటూ జనసేన నేతలు మండిపడుతున్నారు. పోలీసుల తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Khammam Injection Case Live: ఖమ్మం ఇంజక్షన్ హత్యకేసులో సంచలన విషయాలు