Minister RK Roja: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి ఆర్కే రోజా.. చంద్రబాబు వదిలిన బాణం వైఎస్ షర్మిల అని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చడానికి షర్మిల వచ్చిందని విమర్శించారు. చంద్రబాబుకు మేలు చేయడానికి వైఎస్ పేరు షర్మిల వాడుకుంటోందని మండిపడ్డారు. వైఎస్ ఆశయాల కోసం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వస్తే.. వైఎస్ ఆస్తుల కోసం షర్మిల రోడ్డుమీదకు వచ్చిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ కూతురుగా షర్మిల ఒక్క మంచికూడా చేయలేదని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా లేకుండా ఏపీని విభజించిన కాంగ్రెస్ పార్టీలో వైఎస్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసినా పార్టీలో.. షర్మిల చేరి.. వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపైన, నాపై విషం చిమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ఆర్ ఆత్మక్షోభించే విధంగా చేసిందన్నారు.. వైఎస్సాఆర్‌కు, ఆయన ఆశయాలకు నిజమైన వారసుడు సీఎం వైఎస్ జగన్ మాత్రమే అన్నారు మంత్రి ఆర్కే రోజా. ఇక, మంత్రి రోజా చేసిన వ్యాఖ్యల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..
Minister RK Roja: షర్మిలకు మంత్రి రోజా కౌంటర్.. వైఎస్సార్ ఆశయాలకు నిజమైన వారసుడు జగన్ మాత్రమే..!

Rk Roja