Minister Roja Reacts On Exit Polls: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్ అంచనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్‌పై స్పందించారు మంత్రి రోజా. ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్‌పై ఎవరికి కావాల్సిన కథలు వాళ్లు వండుతున్నారని దుయ్యబట్టారు. ఎవరెన్ని చెప్పినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండోసారి సీఎం కావడం తథ్యమని రోజా స్పష్టం చేశారు. సంక్షేమానికి, అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారని.. అందుకే మహిళలు, వృద్ధులు సైతం రాత్రి 9 గంటలైనా ఓపిగ్గా క్యూలైన్లలో వేచియుండి ఓటేశారని రోజా స్పష్టం చేశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధిని పెద్ద ఎత్తున అందించిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని రోజా ప్రశంసించారు. మరిన్ని వివరాల కొరకు కింది వీడియో చుడండి
Minister Roja: నేను ఓడిపోతానా..? ఎగ్జిట్ పోల్స్ పై రోజా ఫస్ట్ రియాక్షన్

Rk