NTV Telugu Site icon

Minister Ramprasad Reddy: భారతదేశంలో నంబర్ వన్‌గా ఏపీఎస్ఆర్టీసీని నిలబెడతాం!

Apsrtc

Apsrtc

భారతదేశంలో నంబర్ వన్‌గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)ని నిలబెడతాం అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఏపీఎస్ఆర్టీసీ ఎప్పుడు సిద్దంగా ఉంటుందన్నారు. గ్రామాలు నుండి నగరాలకు అనుసంధానం చేసే ఘనత ఏపీఎస్ఆర్టీసీ సొంతం అని పేర్కొన్నారు. కార్గో సర్వీస్‌ను డోర్ డెలివరీ ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో మంచి బస్‌లను సిద్దం చేశామని, కొద్ది రోజుల్లో 500 కొత్త బస్‌లను అందుబాటులోకి తీసుకువస్తాం అని మంత్రి చెప్పుకొచ్చారు. నేడు విశాఖలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు సంబంధించిన డోర్ డెలివరీ సర్వీస్‌ను మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు.

మంత్రి రాంప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ‘ప్రజలకు అందుబాటులో ఏపీఎస్ఆర్టీసీ ఎప్పుడూ సిద్దంగా ఉంటుంది. కార్గో సర్వీస్‌ను డోర్ డెలివరీ ప్రారంభించటం సంతోషంగా ఉంది. గ్రామాలు నుండి నగరాలకు అనుసంధానం చేసే ఘనత ఏపీఎస్ఆర్టీసీ సొంతం. ప్రజలకు సేవ చేసే సిబ్బంది మరింత చేరువ కావటానికి డోర్ డెలివరీ సేవలు. సంస్థలో పని చేసే వారికి మంచి ఫలితాలు అందించేందు ప్రభుత్వం సిద్దంగా ఉంది. భారతదేశంలో నంబర్ వన్‌గా ఏపీఎస్ఆర్టీసీను నిలబెడతాం. ముఖ్యమంత్రి ఆదేశాలతో మంచి బస్‌లను సిద్దం చేశాం. కొద్ది రోజుల్లో 500 కొత్త బస్‌లను అందుబాటులోకి తీసుకువస్తాం. ప్రయాణికుల భద్రతకు ఏపీఎస్ఆర్టీసీ ముందు ఉంటుంది. కష్టనష్టాలు ఉన్నా.. ఏపీఎస్ఆర్టీసీ నడుస్తూనే ప్రజలకు సేవ చేస్తూ ఉంటుంది. గత ప్రభుత్వంలో ఆర్టీసీ భూములు అన్యాక్రాంతం జరిగాయి. ఆక్రమణలకు గురైన ఏపీఎస్ఆర్టీసీ భూములు వెనక్కి తీసుకుంటాం. త్వరలో మహిళలకు ఉచిత బస్ సదుపాయం కల్పిస్తాం’ అని చెప్పారు.

Show comments