Ganesh Chaturthi 2025: MCRHRD లో గణేష్ ఉత్సవాలు 2025 పై హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, డీజీపీ జితేందర్.. జీహెచ్ ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్,హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లతో పాటు హైదరాబాద్ ,మేడ్చల్ రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు ఇంకా ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.
INDIA Bloc: ప్రతిపక్ష ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తుషార్! బ్యాగ్రౌండ్ ఇదే!
ఇక ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర రాజధానిలో గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకోవాలని సూచించారు. ప్రజల సహకారంతో దేశంలో గణేష్ ఉత్సవాలు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకుంటామని, అధికారులు గణేష్ ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు. అలాగే గణేష్ ఉత్సవాల మండపాలకు ఉచిత విద్యుత్ అందించబోతున్నట్లు తెలుపుతూ, గత ఏడాది సీఎం రేవంత్ ఈ విషయంలో ఎంతో సహకరించారని గుర్తు చేశారు.
అలాగే ప్రభుత్వం గణేష్ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తుందని, రాష్ట్ర రాజధానిలో జరుగుతున్న అతిపెద్ద వేడుక గణేష్ ఉత్సవాలకు సంబంధించి ఆర్ అండ్ బి, జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీస్,హెల్త్, విద్యుత్ అన్ని విభాగాలు సమన్వయం చేసుకొని పని చేయాలని సూచించారు. ఇక్కడికి వచ్చే ముందే అన్ని డిపార్ట్మెంట్ లు సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకున్నారని ఆయన తెలిపారు. మొత్తంగా శాంతి భద్రతలు, మండపాల వద్ద విద్యుత్ జాగ్రత్తలు, ట్రాఫిక్ ఇబ్బందులు, విగ్రహాలకు వాహనాలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.
