Site icon NTV Telugu

Ponnam Prabhakar: విజయదశమి వేడుకల్లో శమీ పూజలు చేసిన మంత్రి

Ponnam

Ponnam

Ponnam Prabhakar: హన్మాకొండ జిల్లా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ విజయదశమి వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన తన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి శమీ పూజ చేసి ఆయుధాలను పూజించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ముఖ్య నేతలు, పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన కొన్ని ప్రసంగించారు. ముందుగా చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని, ఈ పండుగ రోజున అందరికీ మంచి విజయాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు.

Chennai: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం

తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం బలహీన వర్గాలకు (బీసీలకు) స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించి చరిత్ర సృష్టించిందని మంత్రి అన్నారు. ఈ మేరకు చట్టపరమైన, న్యాయపరమైన అంశాలను పరిశీలించి జీవో జారీ చేసిందని, ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చిందని తెలిపారు. కొంతమంది మేధావులు, బీసీ నాయకులమని చెప్పుకునేవారు ఈ నిర్ణయానికి సహకరించకపోతే మౌనంగా ఉండాలని సూచించారు. గతంలో తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వారే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం చారిత్రాత్మక అంశం అని, దీనికంటే మెరుగైన పద్ధతి ఉంటే భారత ప్రభుత్వం షెడ్యూల్ 9 లో చేర్చాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం చేయాల్సిన లీగల్ ప్రక్రియలన్నీ చేసిందని, ఇప్పుడు దీన్ని అడ్డుకోవద్దని అన్నారు.

Philippinesలో భారీ భూకంపం.. 72కు చేరిన మృతుల సంఖ్య

ఈ విషయంలో బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుకి ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ తరపున ఈ పోరాటాలకు మద్దతిస్తామని ఆయన ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ ఒక పద్ధతిలో మాట్లాడటం లేదని, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్వర్ రెడ్డి వంటి నాయకులు విభిన్నంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. జస్టిస్ ఈశ్వరయ్య, రాజేందర్ వంటివారు జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని, ఈ రిజర్వేషన్లకు ఇంతకంటే మంచి మార్గం ఏదైనా ఉంటే చెప్పాలని సవాల్ విసిరారు. ఇక బలహీన వర్గాలకు 55 వేల పదవులకు అవకాశాలు వస్తున్న ఈ మంచి సమయంలో అనవసరమైన మాటలతో దాన్ని చెడగొట్టవద్దని హెచ్చరించారు. ఈ ప్రక్రియ ఎవరికీ వ్యతిరేకం కాదని, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు కూడా ఇది ఆటంకం కాదని స్పష్టం చేశారు.

IND vs WI: ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి భారత్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్!

ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని పిటిషనర్‌ను కోరారు. ఈ రిజర్వేషన్లకు మద్దతుగా బీజేపీ, బీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎం, ఎంఐఎం వంటి పార్టీలన్నీ న్యాయస్థానాలకు తమ మద్దతు తెలియజేయాలని, అఫిడవిట్లు సమర్పించాలని కోరారు. దీని ద్వారా ప్రజల ముందు దోషిగా నిలబడకుండా ఉండవచ్చని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు.

Exit mobile version