Site icon NTV Telugu

Falaknuma Road Over Bridge: ఫలక్‌నుమా రోడ్ ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్..

Falaknuma Road Over Bridge

Falaknuma Road Over Bridge

Falaknuma Road Over Bridge: చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో, హైదరాబాద్‌లోని పాతబస్తీ వాసుల ట్రాఫిక్ కష్టాలను తీరుస్తూ ఫలక్‌నుమా రోడ్ ఓవర్ బ్రిడ్జి (ROB) అందుబాటులోకి వచ్చింది. ఫలక్‌నుమా రైల్వే ట్రాక్‌పై ఇదివరకు ఉన్న పాత బ్రిడ్జి ఇరుకుగా మారడం, దానిపై ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరగడంతో జీహెచ్ఎంసీ (GHMC) దీనికి సమాంతరంగా కొత్తగా మరో బ్రిడ్జిని నిర్మించింది. రూ. 52 కోట్ల 3 లక్షల వ్యయంతో, 360 మీటర్ల పొడవుతో రెండు లైన్లుగా ఈ కొత్త రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది.

Trisha : నటి త్రిష ఇంటికి బాంబు బెదిరింపు.. రంగలోకి పోలీసులు

మొదట నిర్మించిన ఆర్ఓబీ కేవలం రెండు లైన్లు మాత్రమే ఉండడంతో ఏర్పడే ట్రాఫిక్ జామ్‌లను తగ్గించేందుకు బల్దియా ఈ రెండు కొత్త లైన్లను నిర్మించింది. ఇక నేటి నుంచి ఈ బ్రిడ్జిని ప్రారంభించడంతో, కొంతకాలంగా ఫలక్‌నుమా నుంచి చాంద్రాయణ గుట్టతో సహా ఇతర ప్రాంతాలకు వెళ్లే పాతబస్తీ ప్రయాణికులకు ఊరట లభించింది. ఫలక్‌నుమా కరెంట్ ఆఫీస్ నుంచి కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జి వల్ల చాంద్రాయణ గుట్ట జంక్షన్ నుంచి ఫలక్ నుమా బస్ డిపో వరకు ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

Abhishek Sharma: రాసి పెట్టుకో.. భారత జట్టుకు నువ్వు మ్యాచ్‌లు గెలిపించడానికి నిన్ను సిద్ధం చేస్తున్నా

Exit mobile version