Minister Bhupathi Raju: కేంద్ర సహాయ మంత్రికి ఘన సన్మానం
- మంత్రి శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మ గారిని ఘనంగా సత్కరించిన ఎఫ్ ఎన్ సి సి కార్యవర్గం
- నా వంతు సహాయం ఎప్పుడు కావాలన్న క్లబ్ కి అందిస్తానని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ లోనే నెంబర్ వన్ స్థానంలో నిలబడి ఎన్నో మంచి కార్యక్రమాలు, నిర్వహిస్తున్న సంస్థ ఎఫ్ ఎన్ సి సి. ఈ ఆదివారం సాయంత్రం ఏపీ పార్లమెంట్ సభ్యులు, ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మ గారిని ఘనంగా సత్కరించిన ఎఫ్ ఎన్ సి సి కార్యవర్గం సెక్రెటరీ ముళ్ళపూడి మోహన్, జాయింట్ సెక్రెటరీ వి. వి. ఎస్. ఎస్. పెద్దిరాజు, ట్రెజరర్ బి. రాజశేఖర్ రెడ్డి, జే. బాలరాజు, ఏడిద రాజా, సామా ఇంద్రపాల్ రెడ్డి,మరియు ఎఫ్ . న్.సి.సి ఫార్మర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు .
Also Read:North Korea: కిమ్ తర్వాత ఉత్తర కొరియాను పాలించేది ఈమెనే..
Also Read
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ నటులు మాగంటి మురళీమోహన్, సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్రెటరీ కె.ఎల్. దామోదర్ ప్రసాద్, తెలుగు నిర్మాతల మండలి సెక్రెటరీ టి. ప్రసన్నకుమార్ మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్సాపూర్ పార్లమెంట్ సభ్యులు, ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ : సౌత్ లోనే నెంబర్ వన్ క్లబ్ గా ఫిల్మ్ నగర్ క్లబ్ కి పేరు వుంది.
ఎఫ్ ఎన్ సి సి ఎప్పుడు మంచి కార్యక్రమాల్ని ఏర్పాటు చేస్తూ ఉంటుంది. నేషనల్ గేమ్స్ మరియు ప్రోగ్రామ్స్ చేస్తూ క్రీడాకారులను, కళాకారులను ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ సంస్థ ఇలాగే అంచలంచెలుగా ఇంకా ఎదగాలని కోరుకుంటూ నా వంతు సహాయం ఎప్పుడు కావాలన్న క్లబ్ కి అందిస్తానని తెలియజేసుకుంటున్నాను అన్నారు.
ఎఫ్ ఎన్ సి సి సెక్రటరీ ముళ్ళపూడి మోహన్ మాట్లాడుతూ : ప్రజా సేవలో ఎంతో బిజీగా ఉండి కూడా అడగగానే ఒప్పుకొని మా ఈ సత్కారాన్ని స్వీకరించినందుకు మంత్రివర్యులు శ్రీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారికి కృతజ్ఞతలు. ఎఫ్ ఎన్ సి సి తరఫున చేసే కార్యక్రమాలను ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తున్న అందరికీ కృతజ్ఞతలు. ఇదేవిధంగా అందరూ ఇలానే సపోర్ట్ చేస్తే ముందు ముందు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలతో ఎఫ్ ఎన్ సి సి ని ఇండియా లోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టే విధంగా మా కార్యవర్గం ఎప్పుడూ కృషి చేస్తూనే ఉంటుంది అన్నారు.
తాజావార్తలు
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
-
Secret Soldiers: ‘చైనా’ పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
-
OTR: సిగ్గా.. భయమా.. మొహమాటమా? అంజిరెడ్డి తీరుపై బీజేపీలో హాట్ టాపిక్
-
OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!