NTV Telugu Site icon

Nimmala Rama Naidu: ప్రజలను జగన్ మోసం చేశారన్న మంత్రి నిమ్మల

Nimmala

Nimmala

Nimmala Rama Naidu: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని 6 గ్రామాలలో రోడ్లు, డ్రైనేజ్, మంచినీటి సరఫరా అభివృద్ధి పనులకు రూ. 6 కోట్ల 86 లక్షల నిధులతో మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. పాలకొల్లు మండలంలోని గ్రామాల్లో అభివృద్ధి పథకాల అమలుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. అలాగే, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రభుత్వం విడుదల చేసిన 832 కోట్ల రూపాయల నిధులు, దళారీ వ్యవస్థ లేకుండా వారి అకౌంట్లలో జమ అవుతున్నాయని తెలిపారు.

Also Read: Supreme court: యూనివర్సిటీల్లో కుల వివక్ష.. యూజీసీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఈ సందర్బంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. జగన్ మహమ్మద్ రెడ్డి ప్రభుత్వం, పోలవరం నిర్వాసితులకు 10 లక్షల రూపాయల పరిహారం ఇస్తానని పాదయాత్రలో చెప్పి, అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. జగన్ సర్కార్ నిర్వాసితులను మోసం చేసి, దగా చేశారని మంత్రి అన్నారు. అలాగే, ఓ వృద్ధురాలి చిరునవ్వు ముఖంలో ఉన్న ఆనందాన్ని జగన్‌లో చూడలేమని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. జగన్ ను అక్రమ సంపాదన వెంటాడుతుందని ఆయన విమర్శించారు.

Show comments