Site icon NTV Telugu

Minister Narayana: గుడ్‌న్యూస్‌.. ఇలా చేస్తే 20 శాతం రాయితీతో పాటు మరిన్ని వెసులుబాట్లు..!

Minister Narayana

Minister Narayana

Minister Narayana: విజ‌య‌వాడ‌లో జరిగిన గ్రీన్ ఆంధ్రా స‌మ్మిట్ 2025కు హాజ‌రైన మంత్రి నారాయ‌ణ‌… కీలక వ్యాఖ్యలు చేశారు.. ఇండియ‌న్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ – CII ఆధ్వర్యంలో నోవాటెల్‌లో ఒక‌రోజు స‌దస్సు నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. IGBC స‌ర్టిఫికేష‌న్ ఉండే భ‌వ‌నాల‌కు మ‌రిన్ని రాయితీలు ప్రకటించారు.. అమ‌రావ‌తిలో నిర్మాణాలన్నీ గ్రీన్ హౌస్ భ‌వ‌నాలుగా నిర్మిస్తున్నాం.. గ్రీన్ బిల్డింగ్స్ కు ప‌ర్మిట్ ఫీజులో 20 శాతం రాయితీతో పాటు డెవలప్‌మెంట్‌ చార్జీలు నాలుగు వాయిదాల్లో చెల్లించేలా ఇప్పటికే అవ‌కాశం ఇచ్చాం అని వెల్లడించారు.. గ్రీన్ హౌస్ భ‌వ‌నాల‌కు అధిక ప్రాధాన్యతనివ్వాల‌నే ఉద్దేశంతో మ‌రికొన్ని రాయితీలు ప్రకటిస్తారు.. IGBC ఇచ్చే స‌ర్టిఫికేష‌న్ ఆధారంగా సిల్వర్ బిల్డింగ్‌కు 10 శాతం, గోల్డ్ బిల్డింగ్ కు 15 శాతం, ప్లాటినం బిల్డింగ్‌కు 20 శాతం ఇంపాక్ట్ ఫీజులో డిస్కౌంట్ ఇస్తాం అని తెలిపారు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రీన్ ఎన‌ర్జీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కన్నారు.. ఏపీని డంపింగ్ యార్డ్ ర‌హిత రాష్ట్రంగా మార్చేందుకు అన్ని ప్రయ‌త్నాలు చేస్తున్నాం అన్నారు మంత్రి నారాయణ..

Read Also: Spirit : స్పిరిట్ లో ప్రభాస్ తో నటించే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి

Exit mobile version