గురువారం (మే 15) నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలుకు మంత్రి నారా లోకేష్ వెళ్లనున్నారు. ఇటీవల ఒంగోలులో హత్యకు గురైన టీడీపీ నేత, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించనున్నారు. వీరయ్య చౌదరి గత నెల 22న రాత్రి 7.30 గంటల సమయంలో ఒంగోలులోని ఆయన కార్యాలయంలో దారుణ హత్యకు గురయ్యారు. నిందితులు ఆయన్ను 53 సార్లు విచక్షణారహితంగా పొడిచి హతమార్చారు.
మంత్రి నారా లోకేష్ గురువారం ఉదయం 8 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరతారు. 8:45 గంటలకు చదలవాడలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి 9.20 గంటలకు రోడ్డు మార్గాన అమ్మనబ్రోలు వెళ్తారు. వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. 10:30 గంటలకు చదలవాడలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుని.. తిరిగి బయలుదేరతారు. అక్కడ నుంచి మంత్రి నారా లోకేష్ అనంతపురం వెళ్తారు.
