Minister Nara Lokesh: రోజువారి ప్రభుత్వ పరిపాలనలో ఏఐ వినియోగం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నది మా ప్రభుత్వ లక్ష్యం అన్నారు మంత్రి నారా లోకేష్.. విజయవాడ నోవాటెల్ హోటల్ లో ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు ఆధ్వర్యంలో జరిగిన ఇన్వెస్టోపియా గ్లోబల్ – ఆంధ్రప్రదేశ్ సదస్సులో సీఎం నారా చంద్రబాబు నాయుడతో కలిసి పాల్గొన్న విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్.. ఏఐ అండ్ డేటా సెంటర్లపై జరిగిన చర్చలో మాట్లాడుతూ.. డేటా విప్లవం ద్వారా అంతర్జాతీయంగా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందువరుసలో నిలుస్తోందన్నారు.
Read Also: CM Revanth Reddy: దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలి.. సీఎం రేవంత్ డిమాండ్..
డేటా విప్లవంతో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకుంటాం అన్నారు మంత్రి లోకేష్.. పరిపాలనలో ఏఐ వినియోగం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్న ఆయన.. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్సులతో కరిక్యులమ్ లో మార్పులు తీసుకువస్తున్నాం అన్నారు.. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి యూఏఈ సహకారం తీసుకుంటాం అని ప్రకటించారు మంత్రి నారా లోకేష్.. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2026 జనవరి నాటికి క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నామని సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.. ఆగస్టు 15 నాటికి అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే అందుబాటులోకి తీసుకొస్తున్నాం.. ప్రభుత్వ సేవల కోసం, ఇక ఆఫీసులకు తిరగాల్సిన పని మా రాష్ట్రంలో ఉండబోదని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు..
