Minister Nara Lokesh: ఆస్ట్రేలియాలో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది.. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో శరవేగంగా ముందుకు సాగుతోందని లోకేష్ పేర్కొన్నారు. హెచ్ఎస్ బీసీ బ్యాంక్ సీఈవో ఆంటోనీ షా నేతృత్వంలోని సీనియర్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ బృందంతో మంత్రి నారా లోకేష్ సిడ్నీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విజనరీ సీఎం చంద్రబాబునాయుడు పెట్టుబడిదారులకు ఊతమిచ్చే పారిశ్రామిక విధానాలను ప్రకటించారని, దీంతో కేవలం 16 నెలల్లోనే ఏపీకి రూ.10లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు.. రాష్ట్రంలో 1,051 కిలోమీటర్ల సువిశాల తీరప్రాంతంతో పాటు రోడ్లు, అధునాతన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఒకసారి ఆంధ్రప్రదేశ్ తో ఎంవోయూ చేసుకున్నాక ఆ పరిశ్రమను మాదిగా భావించి అవసరమైన అన్ని అనుమతులు, ప్రోత్సహకాలు అందిస్తామని లోకేష్ తెలిపారు. ఆంధ్రపదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నం భారీ పెట్టుబడులతో డేటా సిటీగా అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. ఏపీలో నెలకొన్న పరిశ్రమల అనుకూల వాతావరణం, అమలుచేస్తున్న సులభతర వాణిజ్య విధానాలను తెలుసుకునేందుకు వచ్చే నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించే పార్టనర్ షిప్ సమ్మిట్ కు రావాల్సిందిగా పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు మంత్రి నారా లోకేష్..
Read Also: Gold Rates: దీపావళి రోజున గోల్డ్ లవర్స్‌కు స్వల్ప ఊరట.. నేడు ధరలు ఇలా..!
