NTV Telugu Site icon

Minister Nara Lokesh: జేఈఈ టాపర్‌ను అభినందించిన మంత్రి లోకేష్.. కష్టానికి ప్రత్యామ్నాయం లేదు..

Guttikonda Manogna

Guttikonda Manogna

Minister Nara Lokesh: జేఈఈ టాపర్ మనోజ్ఞను అభినందించారు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌.. జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి కష్టపడటం ఒక్కటే మార్గం, ఎటువంటి దగ్గర దారులు ఉండవు అంటూ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.. JEE (Mains) – 2025లో నూటికి నూరుశాతం మార్కులు సాధించిన గుత్తికొండ మనోజ్ఞను అభినందించారు లోకేష్.. మనోజ్ఞ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు, మరిన్ని విజయాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.. ఏ అవసరం ఉన్న ఒక్క మెసేజ్ పెట్టు.. అన్నగా అండగా ఉంటానని ఫోన్ నెంబర్ ఇచ్చారు.. ప్రతి బిడ్డ విజయంలో తల్లిపాత్ర ఏంటో నాకు తెలుసు. అందుకే ఆమె తల్లి గారిని కూడా సత్కరించాను అని పేర్కొన్నారు.. మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న మనోజ్ఞ తండ్రితో కరికులం ప్రక్షాళనపై చర్చించారు. ఇండస్ట్రీకి అవసరమైన కరికులం ఉండాలనేది నా ఆలోచన, జాబ్ రెడీ యూత్ ని తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి యువతను ప్రోత్సహించలనేది తమ ధ్యేయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్‌..