Site icon NTV Telugu

Nara Lokesh: ఒకటవ తరగతి చిచ్చరపిడుగును మెచ్చుకున్న నారా లోకేష్.. ఇంతకీ ఏం చేసింది..?

Nara Lokesh

Nara Lokesh

ప్రభుత్వ పాఠ‌శాల‌లో ఒకటో తరగతి చ‌దువుకుంటున్న చిన్నారి ప్రతిభ‌కు మంత్రి నారా లోకేష్ ఫిదా అయ్యారు. ఈ చిచ్చరపిడుగుకి సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో పంచుకున్నారు. పిల్లల ఆస‌క్తి, త‌ల్లిదండ్రుల ప్రోత్సాహకానికి ఉపాధ్యాయుల కృషి తోడైతే ప్రభుత్వ పాఠ‌శాల్లో ఇలాంటి అద్భుతాలు ఇంకెన్నో చూడొచ్చని పోస్టులో పేర్కొన్నారు. ఈ వీడియోలో కనిపిస్తున్న చిన్నారి అన‌కాప‌ల్లి జిల్లా ఎంపీపీ స్కూల్ బాపాడుపాలెం పాఠ‌శాల‌కు చెందిన ఆరాధ్య. ఒక‌ట‌వ త‌ర‌గ‌తి చదువుతోంది. ఈ చిట్టితల్లి త‌న సృజ‌నాత్మక‌త‌తో మైండ్ మ్యాపింగ్ గేమ్ అడింది. ఆమెను ప్రోత్సహించిన ఉపాధ్యాయులను సైతం లోకేష్ మెచ్చుకున్నారు.

READ MORE: CM Revanth Reddy : కేసీఆర్‌కు మేము అన్నం పెడితే మాకు సున్నం పెట్టారు

“అనకాపల్లి జిల్లా, ఎంపీపీ స్కూల్ బాపాడుపాలెం పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్న చిట్టి ఆరాధ్య, తన సృజనాత్మకతతో ప్రదర్శించిన మైండ్ మ్యాపింగ్ మైండ్ బ్లోయింగ్. చిన్నారి ఆరాధ్యకు ఆశీస్సులు. చిన్నారిని చిచ్చరపిడుగులా తీర్చిదిద్దిన బాపాడుపాలెం ఎంపీపీ స్కూల్ ఉపాధ్యాయుడు గంగాధర్ రావుకి అభినందనలు. పిల్లల ఆసక్తి, తల్లిదండ్రుల ప్రోత్సాహానికి ఉపాధ్యాయుల కృషి తోడైతే ప్రభుత్వ పాఠశాలల్లో ఇటువంటి ఇంకెన్నో అద్భుతాలు సాధించవచ్చు.” అని మంత్రి నారాలోకేష్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.

READ MORE: Pakistan: భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్ని రక్షిస్తున్న పాకిస్తాన్.. ఆ ఏడుగురు ఎవరంటే..

Exit mobile version