Site icon NTV Telugu

Minister Nadendla Manohar: సంక్రాంతి తర్వాత రోడ్ల నిర్మాణాలు ప్రారంభం

Nadendla

Nadendla

Minister Nadendla Manohar: కూటమి ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. నియోజకవర్గాల అభివృద్ధిలో భాగంగా, తెనాలికి 25 కోట్ల రూపాయల నిధులు విడుదలయ్యాయని ఆయన చెప్పారు. తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్‌ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవతో ఈ నిధులు విడుదల చేయించారని చెప్పుకొచ్చారు. ఈ నిధులతో తెనాలి కొల్లిపర మండలంలోని గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేస్తామన్నారు. సంక్రాంతి పండుగ తర్వాత ఈ రోడ్ల నిర్మాణాలు ప్రారంభమవుతాయని చెప్పారు. బుర్రి పాలెం రోడ్‌లో మూడు కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేయబోతున్నామని వెల్లడించారు. ఈ కాంప్లెక్స్‌లో స్విమ్మింగ్ పూల్, బాస్కెట్ బాల్, వాలీబాల్ లాంటి క్రీడలకు ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

Read Also: Pawan Kalyan: పవన్ సర్కారులో భాగస్వామి అయ్యాడంటే.. ప్రతీ గిరిజన యువకుడు ప్రభుత్వంలో ఉన్నట్టే..

Exit mobile version