Minister Mallareddy: మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి రెండోసారి ఐటీ విచారణకు హాజరయ్యారు. ఇందులో భాగంగా మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఆర్థిక వ్యవహారాలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. అదేవిధంగా మెడికల్ కాలేజీలో డొనేషన్ల వ్యవహారాలపై ఆయనను ప్రశ్నించారు. ఈ మేరకు ఐటీ అడిగిన ఫార్మాట్ లో మల్లారెడ్డి కాలేజీ వివరాలను భద్రారెడ్డి అధికారులకు అందించారని తెలుస్తోంది. అంతేకాకుండా బ్యాంక్ అకౌంట్లతో పాటు సీట్ల పేమెంట్లకు సంబంధించిన వివరాలను సైతం భద్రారెడ్డి అధికారులకు అందజేశారు. ప్రభుత్వ ఫీజుల కంటే అధిక మొత్తంలో డొనేషన్లు తీసుకున్నారని మల్లారెడ్డి ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలలపై ఆరోపణలు ఉన్నాయి. మూడు గంటల పాటు కొనసాగిన విచారణ అనంతరం ఐటీ కార్యాలయం నుంచి భద్రారెడ్డి తిరిగి వెళ్లిపోయారు. ఐటీ అడిగిన ఫార్మాట్లో వివరాలను భద్రారెడ్డి అధికారులకు అందజేశారు.
Next CM KTR Flexies: కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్.. కూకట్‌పల్లిలో ఫ్లెక్సీల హల్‌చల్
మెడికల్ సీట్ల, డోనేషన్ల విషయంలో అవకతవకలు జరిగాయని, ఈకేసులో ఈడీ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఐటీ శాఖ తెలిపింది. మనీ లాండరింగ్ కోణంలోనూ దర్యాప్తు జరపాలని, అప్పుడే మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని ఐటీ అధికారులు పేర్కొన్నారు. కాగా మంత్రి మల్లారెడ్డి అక్రమాస్తులు కలిగా ఉన్నారంటూ ఐటీ శాఖ మల్లారెడ్డి, ఆయన బంధువులు, ఇళ్లు, కార్యాలయాలు, ఇంజినీరింగ్ కాలేజీల్లో సోదాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో భారీగా నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు విచారణకు హాజరు కావాలని మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు నోటీసులు పంపారు.