రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని కోకపేటలో సగరకుల ఆత్మ గౌరవ భవన నిర్మాణ పనులకు మంత్రులు పట్నం మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని కుల వృత్తుల ఆత్మ గౌరవం పెరిగే విధంగా బిల్డింగ్స్ నిర్మాణం చేస్తున్నారు.. కుల వృత్తుల ప్రోత్సాహంలో భాగంగా సగర కులస్తులకు సైతం అర్హులైన వారందరికి 100 శాతం సబ్సిడీతో లక్ష రూపాయల ఆర్థిక సాయం చేస్తుంది అని ఆయన పేర్కొన్నారు.
Read Also: Shreya Dhanwanthary: కిల్లింగ్ లుక్స్ తో మత్తు లో పడేస్తున్న శ్రేయ ధన్వానంతరీ
ప్రపంచంలోనే అద్భుతంగా పేరు గాంచిన ఇంటింటికి మంచినీళ్లు అందించే తెలంగాణ రాష్ట్ర పథకం మిషన్ భగీరథకు సగర కులస్తుల దైవం భగీరథ పేరు పెట్టి సీఎం కేసీఆర్ గౌరవించారు అని మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. ట్యాంక్ బండ్ పై భగీరథుని విగ్రహం కోసం కృషి చేస్తామన్నారు. సగర కులస్తులను బీసీ-డి నుండి బీసీ-ఏ గ్రూపులో చేర్చాలన్న డిమాండ్ ను సీఎం కేసీఆర్ కు నివేదిస్తామని తెలిపారు. సగరులకు నిర్మాణ రంగంలో రిజర్వేషన్లు కోరుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ కు నివేదిస్తామని మంత్రి పట్నం మహేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క కులానికి సమాన న్యాయం చేస్తుంది సీఎం కేసీఆర్ మాత్రమే అని మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పై ప్రజా వ్యతిరేకత ఉందని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారు.. అందులో నిజం లేదని ఆయన వెల్లడించారు.
Read Also: Minister Harish Rao: పాపం చంద్రబాబు అరెస్ట్ అయ్యి జైల్ లో ఉన్నాడు