NTV Telugu Site icon

Minister KTR: కుసుమ జగదీష్ కుటుంబానికి అండగా ఉంటాం..

Ktr

Ktr

ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ కుటుంబానికి చివరి వరకు అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో, రాజకీయాల్లో జగదీష్ మంచి పేరు తెచ్చుకున్నాడని.. కానీ ఆస్తులు సంపాదించుకోలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఏ పిలుపునిచ్చిన జగదీష్ ప్రాణాలకు తెగించి పోరాడేవాడని.. బీఆర్ఎస్ నిబద్దత కలిగిన నాయకుణ్ణి కోల్పోయిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 7వ తేదీన ములుగులో జరిగిన కార్యక్రమంలో నాతో పాటు జగదీష్ చురుకుగా పాల్గొన్నాడని, ఇంతలోనే జగదీష్ మా నుంచి దూరం కావడం జీర్ణించుకోలేక పోతున్నామని కేటీఆర్ తెలిపారు.

Read Also : G20 Meeting: డిజిటలైజేషన్ తో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.. ప్రధాని నరేంద్ర మోడీ

జిల్లా పరిషత్ ఛైర్మన్ జగదీష్ స్వస్థలం మల్లంపల్లికి చేరుకున్న కేటీఆర్ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జగదీష్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి దైర్యాన్ని కల్పించారు. కేటీఆర్ వెంట రాజ్యసభ సభ్యుడు సంతోష్, మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.

Read Also : Tamannah : అందాల ఆరబోతకు హద్దులు చెరిపేస్తున్న మిల్కీ బ్యూటీ..!!

14 ఏండ్లపాటు హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలోనే ఉంటూ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో జగదీశ్‌ కీలక పాత్ర పోషించారు. గత ఎన్నికల సమయంలో ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. ములుగు జిల్లా ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ ఆయనకు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ గా అవకాశం కల్పించారు.. ఏప్రిల్‌ 1న జగదీశ్వర్‌ తొలిసారి గుండెపోటుకు గురికాగా భార్య రమాదేవి సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడారు. ఆ తర్వాత హైదరాబాద్‌ నిమ్స్‌లో చికిత్స తీసుకున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 9న నిర్వహించిన సంక్షేమ సంబురాల్లోనూ జగదీష్ పాల్గొన్నారు అని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.