Site icon NTV Telugu

Minister KTR: నేడు నాలుగు నియోజకవర్గాల్లో మంత్రి కేటీఆర్ రోడ్ షో..

Ktr

Ktr

తెలంగాణలో ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు దూసుకుపోతున్నాయి. తమకు తోచినట్లు ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇక, అధికార విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలతో తెలంగాణలో రాజకీయం హీటెక్కింది. ఇక, మంత్రి కేటీఆర్ రోజు 4 నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, నేడు నాలుగు ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్‌ రోడ్‌షో లు నిర్వహించబోతున్నారు. మునుగోడు, కోదాడ, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌ నియోజకవర్గాల్లో నిర్వహించే రోడ్ షోలో మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు.

Read Also: Koti Deepotsavam 2023 9th Day: కోటి దీపోత్సవం తొమ్మిదో రోజు.. ఇల కైలాసంలో నేటి కార్యక్రమాలు ఇవే..

ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్.. ఓ సరికొత్త కాన్సెప్ట్‌ను తెరపైకి తీసుకొచ్చారు. తెలంగాణ బలగం పేరుతో ప్రత్యేకంగా ఓ టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో చేరాలంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ ఫ్యాన్స్, తెలంగాణ ఉద్యమకారులకు ఆయన పిలుపునిచ్చారు. అయితే, తెలంగాణ బలగంలో చేరడానికి అవసరమైన గూగుల్ ఫామ్‌ లింక్‌ను కేటీఆర్.. తన అధికారిక ట్విట్టర్ వేదికగా (ఎక్స్) పోస్ట్ చేశారు. దీనికి భారీగా స్పందన వస్తుంది. అయితే, కేసీఆర్‌ను ముచ్చటగా మూడోసారి సీఎంగా గెలిపించుకుందామంటూ ప్రతిజ్ఞ చేస్తున్నారు.

Exit mobile version