Site icon NTV Telugu

KTR: పవన్ కళ్యాణ్ ‘నాకు అన్న లాంటి వాడు’.. మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Ktr Pawan Kalyan

Ktr Pawan Kalyan

KTR: ఏపీ రాజకీయాలపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఏపీలోనూ పోటీచేస్తుందన్నారు. సీఎం కేసీఆర్‌ మాత్రమే ఏపీ ప్రయోజనాలను కాపాడగలరని చెప్పుకొచ్చారు. ప్రజలు అనుకుంటే ఏదైనా జరుగుతుందన్నారు. సీఎం జగన్ జగన్, లోకేశ్, పవన్ తో తనకు ఉన్న సంబంధాల గురించి వివరించారు. మోడీ అయినా.. మరెవరైనా భయపడే ప్రసక్తే లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పేర్కొన్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అవి కాస్త నెట్టింట్లో వైరల్ అయ్యాయి.. తనకు పవన్ మంచి ఫ్రెండ్ గా కేటీఆర్ పేర్కొన్నారు. తనకు అన్న లాంటి వాడని చెప్పారు.

Read Also:Bandi Sanjay: పీవీ చరిత్ర ఘనమైనది.. దక్షిణాది నుంచి ఏకైక ప్రధాని

పలు సందర్భాల్లో కలుసుకున్నామని.. అనేక విషయాలు మాట్లాడుకున్నామని వెల్లడించారు. అనేక అంశాల్లో తమ అభిరుచులు కలుస్తాయని కేటీఆర్ వివరించారు. పవన్ కు సాహిత్యం అంటే ఇష్టమని చెప్పిన కేటీఆర్…తనకు కూడా సాహిత్యం అంటే కొంత ఆసక్తి ఉందన్నారు. తనకు అందరూ స్నేహితులేనని కేటీఆర్ చెప్పుకొచ్చారు. రాజకీయాలకు..స్నేహలకు సంబంధం లేదన్నారు. ఎవరి రాజకీయాలు వారివి.. ఆయన రాజకీయాలు ఆయనవి.. నా రాజకీయాలు నావి.. ఏపీలో నారా లోకేష్ కూడా బాగా తెలుసు.. జగనన్న కూడా మంచి ఫ్రెండ్.. నాకు అందరు స్నేహితులే.. ఎవరితో ఎలాంటి ఇబ్బందులు లేవు.. అంటూ రాజకీయాలు రాజకీయాలే.. మా స్నేహాలు మావే అన్నట్టు కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఇక కేటీఆర్ మాట్లాడుతూ మా పార్టీ కూడా ఏపీలో పోటీ చేస్తుందని.. బీజేపీని వ్యతిరేకించే గొంతు బీఆర్ఎస్ కు మాత్రమే ఉందన్నారు. సీఎం కేసీఆర్ మాత్రమే ఏపీ ప్రయోజనాలను కాపాడగలరన్నారు.

Read Also:Bandi Sanjay: పీవీ చరిత్ర ఘనమైనది.. దక్షిణాది నుంచి ఏకైక ప్రధాని

Exit mobile version