గచ్చిబౌలి జంక్షన్ వద్ద రూ.300 కోట్ల రూపాయలతో ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టిన శిల్ప లే అవుట్ ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజా అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలు ఉండాలని దీనిని సీఎం కేసీఆర్ తెచ్చారన్నారు. ఆరేళ్లలో 33 ప్రాజెక్ట్ లు పూర్తి చేసామని, హైదరాబాద్‌లో ఉన్న మౌలిక వసతులు దేశంలో ఏ నగరంలో లేవన్నారు. నలువైపులా అభివృద్ధి జరుగుతుందని, సీఆర్‌ఎంపీ ద్వారా 710 కిలోమీటర్లు బాగు చేస్తున్నామని, లింకు రోడ్లు అభివృద్ధి చేసామన్నారు. నగరం పెరుగుతుంది, కావునా ప్రజా రవాణా పై దృష్టిని పెట్టాలని, ఎంఎంటీఎస్ కోసం 200 కోట్లు సీఎం కేటాయించారన్నారు. మెట్రో రెండవ దశ 31 కిలో మీటర్లు చేపడతామని, కోవిడ్ వల్ల ప్రభుత్వ ఖజానాకు ఇబ్బంది కలిగిందని, నగరంలో ఇది రెండవ అతి పెద్ద ఫ్లై ఓవరన్నారు.
Also Read : Minister RK Roja: డిక్కీ బలిసిన కోడి తొడకొడితే… కోసి కూర వండేస్తారు
జనవరిలో కొత్తగూడ ఫ్లై ఓవర్ ప్రారంభిస్తామని, ఈ ఫ్లై ఓవర్ ప్రారంభంలో అండర్ పాస్ అవసరం ఉంది అన్నారు..దానిని కూడా చేపడతామన్నారు. ఎస్‌ఆర్‌డీపీ పథకం కేసీఆర్ మానస పుత్రిక అని, ఎస్‌ఆర్‌డీపీ కింద 48 ప్రాజెక్టులు తీసుకోగా 6 ఏళ్ళలో ఇప్పటి వరకు 33 పూర్తి చేశామన్నారు. ఎస్‌ఆర్‌డీపీ కింద 8 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని, ఓఆర్‌ఆర్ వరకు హైదరాబాద్ విస్తరించిందన్నారు. 63 కిలీమీటర్లతో సెకండ్ ఫేజ్ మెట్రో తెస్తామన్నారు. బీహెచ్‌ఈఎల్ నుంచి లక్డికపుల్ వరకు 26 కిలోమీటర్లులు, ఎల్బీ నగర్ నుంచి నాగోల్ వరకు 5 కిలోమీటర్లు మెట్రో పనులు చేపడుతామన్నారు. రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్ట్ వరకు 32 కిలోమీటర్లు మెట్రో రైలు తెస్తామన్నారు. కేంద్రం సహాకరించినా లేకున్నా మెట్రో రైలు సెకండ్ పేజ్ తెస్తామని ఆయన స్పష్టం చేశారు.