Site icon NTV Telugu

పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి

KTR

తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తన జన్మదిన వేడుకలకు ఎవరూ హైదరాబాద్ రావద్దని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు పార్టీ శ్రేణులకు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు. మరో రెండు మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులంతా క్షేత్రస్థాయిలోనే ప్రజలకు అందుబాటులో ఉండాలని, అవసరమైన చోట సహాయక చర్యల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ ప్రజాప్రతినిధులకు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో, పార్టీ శ్రేణులంతా ఈ సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని కేటీఆర్ సూచించారు.

Read: తమ్ముడిని ప్రోత్సహించమంటున్న నాగశౌర్య!

ఈ నేపథ్యంలో రేపు తాను ఎవరిని కలవడం లేదని, ఈ విషయంలో అన్యధా భావించవద్దని పార్టీ శ్రేణులను కేటీఆర్ కోరారు. ఇప్పటికే విజ్ఞప్తి చేసిన మేరకు తమకు తోచిన విధంగా ఎవరికి వారు ఇతరులకు సహాయం అందిస్తూ, మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని కేటీఆర్ మరోసారి విజ్ఞప్తి చేశారు.

Exit mobile version