Minister KTR Addressed at JNTU Golden Jubilee Celebrations
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లోని జెఎన్‌టీయూ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్‌లో భాగంగా జరుగుతున్న ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇన్నోవేషన్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (ఐసీఐఈటీ-2022) ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్క తెలంగాణలోనే ప్రతి ఇంటికి తాగునీరు అందుతోందన్నారు. కాళేశ్వరం ఇంజినీరింగ్ అద్భుతమని, ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తెలంగాణలో కట్టుకున్నామన్నారు. అంతేకాకుండా.. జేఎన్‌టీయూ విద్యార్థులు అంతా వెళ్లి ప్రాజెక్టు విజిట్ చేయండని ఆయన సూచించారు. మనం ఇంటికి వెళ్లి చుట్టూ చూస్తే అన్ని వేరే దేశాలు తయారు చేసిన వస్తువులే ఉంటాయని, ఈ 75 ఏళ్లలో మన ఇండియా ఒక స్పార్క్ మిస్ అయిందన్నారు.
మనం మసీదునీ కూలగొట్టి గుడి కడదం అంటూ గతాన్ని తోడే పనిలో బిజీగా ఉన్నామని, కానీ చైనా లాంటి దేశాలు మాన్యుఫాక్చరింగ్ పై ఫోకస్ పెట్టాయన్నారు. కులమతాల గొడవలకు ప్రియారిటి ఇస్తే వెనకబడతామని ఆయన వ్యాఖ్యానించారు. స్టూడెంట్స్ జాబ్ సీకర్‌గా కాకుండా జాబ్ క్రియేటర్ గా తయారవ్వాలని ఆయన పిలుపునిచ్చారు