Site icon NTV Telugu

Kottu Satyanarayana: సీఎం జగన్ సంతోషంగా అమ్మవారిని దర్శించుకున్నారు

Kottu

Kottu

విజయవాడలో ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ అమ్మవారిని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దర్శించుకుని ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా దేవస్ధానం పంచాంగంను మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రారంభించారు. సీఎం జగన్ ఎంతో సంతోషంగా అమ్మవారిని దర్శించుకున్నారు అని ఆయన పేర్కొన్నారు. వింజామర వీస్తూ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరుకున్నారు సీఎం జగన్.. గత ఆరు రోజులుగా దసరా ఉత్సవాలు ప్రశాతంగా జరిగాయన్నారు.

Read Also: Navaratri Special : కాంతార సీన్.. ఆకట్టుకుంటున్న దుర్గమ్మ పూజ.. ఎక్కడంటే?

ఎక్కడా ఏ చిన్న అవాంతరం కలుగకుండా ఆ అమ్మవారు చూస్తున్నారు అంటూ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. మొత్తం ఐదు రోజుల్లో 4 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.. ఇవాళ ఒక్కరోజు 1.70 వేల వరకూ అమ్మవారి దర్శనం చేసుకున్నారు అని ఆయన తెలిపారు. ఇంద్రకీలాద్రి అభివృద్ధిపై సీఎం కచ్చితమైన అవగాహనతో ఉన్నారు.. 55 కోట్ల రూపాయలు ఇంకా ఉన్నాయి.. ఇది కాక 145 కోట్ల రూపాయల ఆలయం నిధుల నుంచీ వినియోగిస్తాం అని మంత్రి చెప్పారు.
కార్ పార్కింగ్ కోసం బీఓటీ కూడా సిద్ధం చేస్తున్నాం అని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఇంద్రకీలాద్రిపై ఒక రెస్టారెంట్ కూడా సిద్ధం చేస్తున్నాం అని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. నవంబర్ నుంచీ ఒకటిన్నర సంవత్సరంలో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తవుతాయి.. మీడియా కూడా హుందాగా రిపోర్టింగ్ చేశారు.. భవానీ మాలధారులు మరో మూడు రోజులు దీక్ష విరమణకు వస్తారు అని మంత్రి వెల్లడించారు.

Exit mobile version