YSRCP: బెజవాడలో తూర్పు నియోజకవర్గ వైసీపీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. ఇక్కడ అభిమానుల ఆనందం చూస్తుంటే అవినాష్ పడిన కష్టం కళ్ళ ముందు కనిపిస్తుంది అని అన్నారు. నెహ్రు ఆశయాన్ని తప్పక అవినాష్ నెరవేరుస్తారు.. ఎమ్మెల్యే, మంత్రుల కన్నా ఎక్కువ నిధులు తీసుకు వచ్చి నియోజకవర్గాన్ని అవినాష్ అభివృద్ది చేశారు అని చెప్పుకొచ్చారు. జగన్ వద్దకు నేరుగా వెళ్లి నిధులు తెచ్చుకున్నాడు.. ఎండ అనక వాన ఆనక నాలుగు సంవత్సరాల పాటు అవినాష్ ఏంతో కష్టపడ్డాడు అని ఆయన చెప్పారు. ఈ యాభై రోజులు అవినాష్ కోసం కార్యకర్తలు మరింత కష్టపడాలి.. 298 మంది బూతు ఇంచార్జీలు యాక్తివ్ గా ఉండండి.. జగనన్న తమ్ముడుగా అవినాష్ పడిన కష్టంతో తూర్పులో వైసీపీ జెండా ఎగరబోతవుంది.. నలభై రోజుల్లోపు ఎన్నికలు రానున్నాయి.. మనం కాలర్ ఎగరవేసుకొని తిరగాలి అవినాష్ ని గెలిపించాలి అంటూ మంత్రి జోగి రమేష్ పిలుపునిచ్చారు.
Read Also: Niharika Konidela: కొత్త అవతారంలో మెగా డాటర్.. ఆహా.. అనాలంట
ఇక, వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సిద్ధం సభలు చూస్తుంటేనే చంద్రబాబు బ్యాచ్ కి భయం పట్టుకుంది అని విమర్శించారు. చంద్రబాబు పెట్టే సభలకు జగన్ సభలకు పొంతనే లేదు.. పవన్ కళ్యాణ్ పరిస్తితి ప్రశ్నార్థకంగ ఉంది.. లోకేశ్ మళ్ళీ ఒడిపోబోతున్నాడు.. నియోజకవర్గoలో అవినాష్ పెట్టిన మీటింగ్ లకే చంద్రబాబు సభల కన్న ఎక్కువ మంది వస్తున్నారు.. గద్దె రామ్మోహన్ టీడీపి హయాంలో ఏం చేశాడు అని ఆయన ప్రశ్నించారు. ఇంచార్జీగా ఉన్న అవినాష్ నియోజకవర్గంలోనే విజయవాడ మూడు నియోజక వర్గాల్లో ఎక్కువ అభివృద్ది జరిగింది.. గద్దె రామ్మోహన్ గుడ్డి గాడిదకు పల్లు తోమినట్లు వ్యవహరించాడు.. అవినాష్ గెలిస్తెనే నియోజకవర్గంలో అభివృద్ది జరుగుతుంది అని వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.
Read Also: PM Modi: మోడీని కలిసిన సందేశ్‌ఖాలీ బాధిత మహిళలు
వైసీపీ తూర్పు ఇంఛార్జ్ దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. తూర్పులో వైసీపీ జెండా ఎగుర వేస్తాం.. వైసీపీ హయాంలో అభివృద్ది సంక్షేమం జరిగింది అని చెప్పుకొచ్చారు. రాబోయే యాభై రోజులు ఏంతో కీలకమైనవి.. తూర్పులో వైసీపీ, రాష్ట్రంలో జగన్ అధికారంలోకి రావడం ఖాయం.. గద్దె రామ్మోహన్, చంద్రబాబు గుంట నక్కలు లాంటి వారు అని విమర్శలు గుప్పించారు. స్వంతత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు నుంచే గద్దెకు అసత్యాలు ప్రచారం చేయటం అలవాటు అయింది.. నాటకాలు ఆడటంలో గద్దె ఎక్స్పర్ట్.. ఇప్పుడు లేని ఆరోపణలు చేస్తూ తమను రెచ్చకొడుతున్నారు.. ఏదైనా గొడవ అయితే దాని ద్వారా లబ్ధి పొందాలని గద్దె చూస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి నీచ రాజకీయాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది.. అసలు వాస్తవాలు చూస్తే కాల్ మనీ, బెట్టింగ్, గంజాయి లాంటివి గద్దె రామ్మోహన్ ప్రోత్సహిస్తారు అంటూ దేవినేని అవినాష్ ఆరోపించారు.