NTV Telugu Site icon

Jogi Ramesh: ఇది మెగా పీపుల్స్ సర్వే.. దేశ చరిత్రలోనే అరుదైన ఘట్టం

Minister Jogi Ramesh

Minister Jogi Ramesh

Jogi Ramesh: రాష్ట్రవ్యాప్తంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన జగనన్నే మన భవిష్యత్‌ కార్యక్రమం విస్తృతంగా సాగుతోంది.. భారత దేశ రాజకీయ చరిత్రలోనే ఇదో అరుదైన ఘట్టంగా అభివర్ణించారు మంత్రి జోగి రమేష్.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర భవిష్యత్తు జగనన్నే అనే సర్వే మొదలు పెట్టాం.. ఏడు లక్షల మంది జగనన్న సైనికులు కార్యక్రమంలో పాల్గొన్నారు.. వారం రోజుల్లోనే 61 లక్షల ఇళ్లను సందర్శించారు.. జగనన్నకు మద్దతుగా 47 లక్షల మంది మిస్డ్ కాల్ చేశారని తెలిపారు.. అధికారంలోకి వచ్చిన వెంటనే నవరత్నాలు ప్రారంభించారు సీఎం జగన్.. వాటితో కోట్లాది మంది లబ్ధిపొందారని తెలిపారు.. జగనన్నే మన భవిష్యత్‌ పేరుతో నిర్వహించిన మెగా పీపుల్స్ సర్వే ఇది.. భారత దేశ రాజకీయ చరిత్రలోనే ఇదో అరుదైన ఘట్టంగా అభివర్ణించారు.

Read Also: Asad Ahmed: ప్రయాగ్‌రాజ్‌లో అసద్ అహ్మద్ అంత్యక్రియలు.. తండ్రికి అనుమతి నిరాకరణ

కాగా, జగనన్నే మన భవిష్యత్తు పేరుతో వైసీపీ ఈ నెల 11వ తేదీన ఈ కార్యక్రమం ప్రారంభించింది.. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా లేకపోతే పార్టీకి నష్టమని నాయకత్వం భావిస్తుంది. గ్రామస్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. దీంతో ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని జగన్ పట్టుదలగా ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ 151 ఎమ్మెల్యే స్థానాలను దక్కించుకుంది. కానీ వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలను దక్కించుకోవాలని ఆ పార్టీ వ్యూహరచనతో ముందుకు వెళ్తుంది. గ్రామస్థాయి నుండి పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ నాయకత్వం చర్యలు చేపట్టింది.ఈ క్రమంలోనే ఇటీవల నే గృహ సారధులు , పార్టీ కన్వీనర్ల నియామకాన్ని చేశారు.