Site icon NTV Telugu

Janardhan Reddy : కమీషన్ల కోసమే బుగ్గన అక్రమాలు.. మంత్రి జనార్థన్ రెడ్డి ఫైర్..

Janardhan

Janardhan

Janardhan Reddy : కమీషన్లు తీసుకోవడం కోసమే నాణ్యతలేని పనులు, కాంట్రాక్టులను బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేశారని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏపీని సర్వనాశనం చేసిందంటూ మండిపడ్డారు. బుగ్గన తమ తప్పులను కప్పి పుచ్చుకునేందుకు కూటమి ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుగ్గన చెప్పే పిట్ట కథలను ఎవరూ నమ్మరని.. ప్రజలు అధికారం కట్టబెడితే వైసీపీ ప్రజావేదికను కూల్చేసి తమ అరాచక పాలన మొదలు పెట్టిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వైసీపీకి తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదంటూ మండిపడ్డారు.

Read Also : Deepika : స్పిరిట్ vs AA22xA6.. దీపిక చేసింది కరెక్టేనా?

‘బుగ్గన ఫైనాన్స్ మినిస్టర్ గా ఉండి మా మీద వేల కోట్లు అప్పు పెట్టారు. ఆయన పెట్టిన అప్పులను మేం ఇప్పుడు భరిస్తున్నాం. కావాలంటే ఈ విషయంలో బుగ్గన సవాల్ కు సిద్ధం కావాలి. బుగ్గన అనుభవం లేని వ్యవహారాల వల్లే రాష్ట్రం అప్పుల పాలైంది. వైసీపీ ఐదేళ్ల పాలనలో పోలవరాన్ని ఒక్క అడుగు కూడ ముందుకు తీసుకెళ్లలేకపోయింది. కూటమి వచ్చాకే రాజధానిని మళ్లీ నిర్మిస్తున్నాం. నేను ఫైనాన్స్ మినిస్టర్ అయిన తర్వాతనే ఆర్&బీలో రూ.1153 కోట్ల బిల్లులు చెల్లించాను. ఈ విషయంలో దేనికైనా సిద్ధమే. వైసీపీ పాలనలో కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించకపోవడంతో ఆత్మహత్యలు చేసుకున్నారు. కాంట్రాక్టర్లను పొట్టన బెట్టుకున్నారు. అందుకే మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేశారు. లిక్కర్, మైనింగ్ స్కామ్ లలో ఎవరున్నా సరే వదిలిపెట్టేది లేదు’ అంటూ చెప్పారు.

Read Also : TG Cabinet Expansion: రేపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ..?

Exit mobile version