Minister Harish rao Bhoomi Puja was performed for the construction of the temple
సంగారెడ్డి జిల్లాలోని కంది గ్రామంలో హరేకృష్ణ కల్చరల్ సెంటర్, రాధాకృష్ణ టెంపుల్‌కి మంత్రి హరీష్ రావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్చరల్ సెంటర్ కందిలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి రోజు అక్షయ పాత్ర ఫౌండేషన్ కొన్ని లక్షల మందికి భోజనం అందిస్తుందని, మనం ఎంత ఎత్తుకు ఎదిగిన చేరుకోవాల్సింది భగవంతుడి దగ్గరికేనన్నారు. ఎంత సంపాదించిన, ఏం చేసినా చివరికి భగవంతుడికి సొంతమన్నారు మంత్ర హరీష్‌రావు. మనం నిమిత్త మాత్రులమని ఏ చట్టాలు, పోలీసులు, ప్రభుత్వాలు చేయలేని పని భగవంతుడు చేస్తాడంటూ ఆయన వ్యాఖ్యానించారు. మనల్ని మంచి మార్గంలో నడిపే శక్తి భగవంతుడికే ఉందని, కల్చరల్ సెంటర్ కి ఏమైనా కావాలంటే నా వ్యక్తిగతంగా సహాయం చేసే అవకాశం ఇవ్వండని ఆయన అన్నారు.
ఇదిలా ఉంటే.. వర్షాకాలం కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ ఇంటి పరిసరాను శుభ్రం చేసుకోవాలని మంత్రి హరీష్ రావు సూచించారు. ఈ క్రమంలోనే నేడు ఆయన తన ఇంటి పరిసరాలలో మొక్కలు కుండీల్లో, ఇతర చోట్ల నిలిచిఉన్న నీటిని తొలగించారు. ప్రతి ఒక్కరూ ఆదివారం 10 నిమిషాలు కేటాయించి ఇంటి పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించాలన్నారు. డెంగ్యూకు కారణమయ్యే ఏడిస్ దోమల వృద్ధికి కారణమయ్యే నీటిని తొలగించండని ఆయన అన్నారు.