NTV Telugu Site icon

Chellaboina venugopal krishna: అమెరికాలో ఉన్న సిలబస్ ను ఏపీలో అమలు చేస్తాం..

Chelluboina Venu

Chelluboina Venu

మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది అని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. విద్యాశాఖలో అంతర్జాతీయ ప్రమాణాల కల్పన అనే చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్నాము.. ఐబీ సిలబస్ కు లెటర్ ఆఫ్ ఇండెంట్ కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.. అమెరికాలో ఉన్న సిలబస్ ను ఇక్కడ అమలు చేస్తాం.. నిజ జీవితానికి దగ్గరగా ఈ సిలబస్ ఉంటుంది.. ఎమ్ఓయూ చేసుకున్నాం.. వారానికి ఒక రోజు టోఫెల్ పై ఇప్పటికే శిక్షణ ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఏపీ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లు 2023కి ఆమోదం తెలిపినట్లు మంత్రి చెప్పారు. దీని వల్ల 10 వేల మంది ఉద్యోగులకు లబ్ది పొందుతారు. ఏపీజీపీఎస్ బిల్లు -2023 కు క్యాబినెట్ ఆమోదం పొందిందని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగ విరమణ సమయానికి ఇంటి స్థలం కేటాయించటం ప్రభుత్వం తమ బాధ్యతగా తీసుకుందని మంత్రి చెల్లుబోయిన వేణు అన్నారు.

Read Also: Venu Thottempudi: మహేష్ , అల్లు అర్జున్ సినిమాలు వదులుకున్నందుకు నాకేం బాధగా లేదు..

రిటైర్ అయిన ఉద్యోగుల పిల్లలకు ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ వర్తింప చేసేందుకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది అని మంత్రి చెల్లుబోయిన వేణు అన్నారు. దీని వల్ల చిరు ఉద్యోగులకు ప్రయోజనం అందుతుంది.. విధి విధానాలు రూపొందించాల్సి ఉంది.. ఏపీ వైద్య విధాన పరిషత్ ను రద్దు చేసి కొత్త విధానానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.. జీరో వెకెన్సీ పాలసీని వైద్య రంగంలో రాష్ట్రంలో అమలు చేయనున్నామని ఆయన తెలిపారు. దీనికి మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. నవంబర్ 15 నాటికి జగనన్న ఆరోగ్య సురక్షాను అందుబాటులోకి తీసుకోస్తామని చెప్పారు. ఏపీ ప్రైవేటు యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లుకు కూడా మంత్రి మండలి ఆమోదం లభించిందని ఆయన సూచించారు.

Read Also: Bigg Boss: బిగ్‌బాస్‌ షో నిలిపివేయాలన్న పిటిషనర్‌కు ఏపీ హైకోర్టు షాక్..

కురుపాంలోని ట్రైబల్ యూనివర్సిటీలో 50 శాతం సీట్లు గిరిజన విద్యార్థులకు రిజర్వ్ చేస్తూ ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ తెలిపారు. ఏపీ ఆధార్ చట్టం పై బిల్లు, పోలవరం నిర్వాసితులకు 8424 ఇళ్ళ నిర్మాణానికి పెరిగిన అంచనా వ్యయం కోసం మరో 70 కోట్లు, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో ఒక పథకం, ప్రిలిమ్స్ పాసైతే లక్ష, మెయిన్స్ పాసైతే మరో 50 వేలు, ఇంటర్వ్యూకు మరో 50 వేల ప్రోత్సాహం ఇవ్వటానికి క్యాబినేట్ ఆమోదం తెలిపిందని మంత్రి వేణు అన్నారు. ఎన్ని సార్లు ఉత్తీర్ణులైతే అన్ని సార్లు ప్రోత్సాహ నగదు ఇస్తామని చెల్లుబోయినన వేణుగోపాల్ తెలిపారు.