Buggana Rajendranath Reddy: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల సమయంలో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. విపక్ష కూటముల మధ్య ఆరోపణలు, విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇక, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారని ఆరోపిస్తోన్న తరుణంలో.. విపక్షాలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. మా హయాంలో నేచేసిన అప్పులు మేమే కట్టాలంటే.. గతంలో మీరు చేసిన అప్పులు మరి మీరే కడతారా? అంటూ నిలదీస్తున్నారు. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. నేను చేసిన అప్పులు నేనే కట్టాలా? అంటూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని నిలదీశారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. అంతే కాదు.. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిన లక్షల కోట్ల అప్పులు అతనే కడతారా? అంటూ ఎద్దేవా చేశారు. ఇక, నా వెంట వస్తే నేను చేసిన అభివృద్ధి చూపిస్తాను అంటూ సవాల్ విసిరారు.. నీ వెంట నేను స్వతా.. మరి నువ్వు చేసిన అభివృద్ధి చూపిస్తావా? అంటూ ప్రశ్నించారు మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి..
Read Also: Dil Raju: Deverakonda: మొన్న అన్నారు.. ఇప్పుడు చేసి చూపించారు
డోన్‌లో మీడియాతో మాట్లాడిన ఆర్థిక మంత్రి బుగ్గన.. కోట్ల ప్రకాష్ రెడ్డి ఒకరోజు డోన్, పులివెందల మాత్రమే అభివృద్ధి చెందాయి అంటారు.. మరొక రోజు అభివృద్ధి ఎక్కడ అంటారు.. 75 ఏళ్ల తరువాత రాజకీయాలు చేస్తే ఇలాంటి ఆలోచనలే వస్తాయి.. నా వెంట వస్తే నేను చేసిన అభివృద్ధి చూపిస్తా.. నీ వెంట నేను వస్తే నువ్వు చేసిన అభివృద్ధి చూపిస్తావా..? అని సవాల్ చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏమి సాధించారో చెప్పండి..? అని నిలదీశారు. నా ఎన్నికల నామినేషన్ పై తప్పుడు ప్రచారం చేస్తారా..? అంటూ ఫైర్ అయ్యారు.. డోన్ నియోజకవర్గాన్ని కర్నూల్లో కలుపుతారా ? నంద్యాలలో కలుస్తున్నప్పుడు మీరే అధికారంలో ఉన్నారు కదా..? అని నిలదీశారు. నేను ఆర్థిక నేరస్తుడని అసత్య ప్రచారాలు చేస్తారా..? ఆర్థిక నేరస్తుడు అంటే మీకు అర్థం తెలుసా..? అని ప్రశ్నించిన ఆయన.. ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేస్తే ఆర్థిక నేరస్తుడు అవుతారు.. నేనెవరికీ అలా చేయలేదే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. మీరిద్దరూ మద్యం సిండికేట్లలో 60 ,40 పంచుకోలేదా..? మీరు ఎంత మంది వద్ద డబ్బులు వసూళ్ళు చేయలేదు, మీరు ఎంతమందికి డబ్బులు ఎగ్గొట్టలేదు… మీరు ఎన్నికల ప్రచారాల్లో మేము వచ్చాక దొంగసారా, దొంగ మైనింగ్ చేసుకుందురులే అని హామీ ఇస్తారు..? అంటూ సవాల్ విసిరారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.