NTV Telugu Site icon

Food Order : కొడుకు మొబైల్‎లో గేమ్స్ ఆడుకుంటున్నాడులే అనుకున్నాడు.. కానీ

New Project 34

New Project 34

Food Orders : కరోనా మహమ్మారి పుణ్యమా అని పిల్లలకు విద్యాసంస్థలు ఆన్ లైన్ క్లాసులు స్టార్ట్ చేశాయి. దీంతో పిల్లలకు కూడా స్మార్ట్ ఫోన్లు తప్పనిసరి అయ్యాయి. దీంతో చాలామంది పిల్లలు క్లాసుల సంగతి ఏమో గానీ ఫోన్ కు మాత్రం బాగానే అడిక్ట్ అయ్యారు. క్లాస్ జరిగే సమయం మినహా మిగతా టైం అంతా ఆ ఫోన్ తోనే కాలక్షేపం చేస్తున్నారు. కొందరి పిల్లల తల్లిదండ్రులు కూడా వారు ఫోన్ చూస్తుంటే క్లాస్ వింటున్నాడులే అని పట్టించుకుంటలేరు. అలాగే అమెరికాలో ఓ తండ్రి కొడుకుపై కన్నేయకపోవడంతో భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

Read Also: Honey Rose: బాలయ్యకే కాదు నిన్ను చూస్తే ఎవరికైనా మనోభావాలు దెబ్బతినాల్సిందే

అమెరికాలోని మెట్రో డెట్రాయిట్, చెస్టర్ఫీల్డ్ టౌన్ షిప్ ప్రాంతంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. కొడుకు స్మార్ట్ ఫోన్ పట్టుకుని బెడ్ పై కూర్చుకున్నాడు. అత‌డు మొబైల్ గేమ్స్ ఆడుకుంటున్నాడేమోన‌ని ఆ బాలుడి తండ్రి భావించాడు. అయితే, ఆ బాలుడు ఫుడ్ డెలివ‌రీ యాప్ లో తెలిసీతెలియ‌క‌ ఏకంగా దాదాపు రూ.80 వేల ఆహార ప‌దార్థాల ఆర్డర్ ఇచ్చాడు. ఒక దాని త‌ర్వాత మ‌రొక‌టి ఇలా ఇంటికి వ‌రుస‌గా ఆహారపదార్థాలు రావడంతో తండ్రి షాక్ అయ్యాడు. త‌న బ్యాంకు అకౌంట్ నుంచి రూ.80 వేలు క‌ట్ అయ్యాయని తెల్సుకుని కంగుతిన్నాడు. త‌న స్మార్ట్ ఫోన్ తీసుకుని చూశాక ఆ తండ్రికి అస‌లు విష‌యం తెలిసింది.

Read Also: Off The Record: బీఆర్‌ఎస్‌లో మామిడితోట విందు రాజకీయాలు.. ఎమ్మెల్యేపై తిరుగుబాటు..!

గ్రుభ‌బ్ ఫుడ్ డెలివ‌రీ యాప్ లో త‌న కుమారుడు రూ.80 వేల విలువ‌చేసే ఫుడ్ ఆర్డర్ చేశాడ‌ని, టిప్ గా ప్రతి ఆర్డర్ కు ఫుడ్ రేటులో 25శాతం ఇచ్చినట్లు తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. చికెన్, శాండ్ విచ్ వంటి ప‌దార్థాలు వరుసగా డెలివ‌రీ బాయ్స్ తీసుకురావ‌డం చూసి షాక్ అయ్యానన్నాడు. త‌న కొడుకు వయస్సు ఆరేళ్లుగా తెలిపాడు.