Food Order : కొడుకు మొబైల్లో గేమ్స్ ఆడుకుంటున్నాడులే అనుకున్నాడు.. కానీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Food Orders : కరోనా మహమ్మారి పుణ్యమా అని పిల్లలకు విద్యాసంస్థలు ఆన్ లైన్ క్లాసులు స్టార్ట్ చేశాయి. దీంతో పిల్లలకు కూడా స్మార్ట్ ఫోన్లు తప్పనిసరి అయ్యాయి. దీంతో చాలామంది పిల్లలు క్లాసుల సంగతి ఏమో గానీ ఫోన్ కు మాత్రం బాగానే అడిక్ట్ అయ్యారు. క్లాస్ జరిగే సమయం మినహా మిగతా టైం అంతా ఆ ఫోన్ తోనే కాలక్షేపం చేస్తున్నారు. కొందరి పిల్లల తల్లిదండ్రులు కూడా వారు ఫోన్ చూస్తుంటే క్లాస్ వింటున్నాడులే అని పట్టించుకుంటలేరు. అలాగే అమెరికాలో ఓ తండ్రి కొడుకుపై కన్నేయకపోవడంతో భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
Read Also: Honey Rose: బాలయ్యకే కాదు నిన్ను చూస్తే ఎవరికైనా మనోభావాలు దెబ్బతినాల్సిందే
Also Read
అమెరికాలోని మెట్రో డెట్రాయిట్, చెస్టర్ఫీల్డ్ టౌన్ షిప్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొడుకు స్మార్ట్ ఫోన్ పట్టుకుని బెడ్ పై కూర్చుకున్నాడు. అతడు మొబైల్ గేమ్స్ ఆడుకుంటున్నాడేమోనని ఆ బాలుడి తండ్రి భావించాడు. అయితే, ఆ బాలుడు ఫుడ్ డెలివరీ యాప్ లో తెలిసీతెలియక ఏకంగా దాదాపు రూ.80 వేల ఆహార పదార్థాల ఆర్డర్ ఇచ్చాడు. ఒక దాని తర్వాత మరొకటి ఇలా ఇంటికి వరుసగా ఆహారపదార్థాలు రావడంతో తండ్రి షాక్ అయ్యాడు. తన బ్యాంకు అకౌంట్ నుంచి రూ.80 వేలు కట్ అయ్యాయని తెల్సుకుని కంగుతిన్నాడు. తన స్మార్ట్ ఫోన్ తీసుకుని చూశాక ఆ తండ్రికి అసలు విషయం తెలిసింది.
Read Also: Off The Record: బీఆర్‌ఎస్‌లో మామిడితోట విందు రాజకీయాలు.. ఎమ్మెల్యేపై తిరుగుబాటు..!
గ్రుభబ్ ఫుడ్ డెలివరీ యాప్ లో తన కుమారుడు రూ.80 వేల విలువచేసే ఫుడ్ ఆర్డర్ చేశాడని, టిప్ గా ప్రతి ఆర్డర్ కు ఫుడ్ రేటులో 25శాతం ఇచ్చినట్లు తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. చికెన్, శాండ్ విచ్ వంటి పదార్థాలు వరుసగా డెలివరీ బాయ్స్ తీసుకురావడం చూసి షాక్ అయ్యానన్నాడు. తన కొడుకు వయస్సు ఆరేళ్లుగా తెలిపాడు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?