Site icon NTV Telugu

Michelle obama: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై మిచెల్ ఒబామా క్లారిటీ!

Obe

Obe

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై మాజీ అధ్యక్షుడు ఒబామా సతీమణి మిచెల్ ఒబామా క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వయసు రీత్యా మరొకసారి పోటీ చేయలేరేమోనన్న కారణంతో మిచెల్ రంగంలోకి దిగొచ్చని.. ఆమె అధ్యక్ష పదవికి పోటీ చేయొచ్చని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపించాయి.

తాజాగా ఇదే అంశంపై మాజీ ప్రథమ మహిళ కార్యాలయం స్పందించింది. మిచెల్ ఒబామా అధ్యక్ష పదవికి పోటీ చేయట్లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఆమె అభిమానులకు ఇది చేదువార్తే. అధ్యక్షుడు జో బైడెన్, కమలా హారిస్ తిరిగి ఎన్నికల ప్రచారంలో పూర్తిగా ఉత్సాహంగా ఉన్నారని తెలిపింది.

Exit mobile version