Michael Clarke: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి మరోసారి వివాదాల్లో చిక్కుకున్నాడు. క్లార్క్ తనను మోసం చేశాడంటూ అతడి ప్రేయసి జేడ్ యార్‌బ్రో ఆరోపణలు చేసింది. అలాగే అందరూ చూస్తుండగా అతడిపైన దాడి కూడా చేసింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు వ్యక్తిగత సమస్యల్ని ఇలా రోడ్డుపైకి తెచ్చుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో మైఖేల్ క్లార్క్ చొక్కా లేకుండా షార్ట్ మాత్రమే ధరించి కనిపించాడు. అలాగే తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు తెలుస్తోంది. అతడి గర్ల్ ఫ్రెండ్ జేడ్ ముందు తన కూతురిపై ప్రమాణం చేయడం కూడా తెలుస్తోంది. క్లార్క్ మాటలకు పట్టించుకోని జేడ్.. ముందుకు వెళ్లినట్లు వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చి అతడిని చెంపదెబ్బ కొట్టింది. క్లార్క్, జేడ్, ఆమె సోదరి జాస్మిన్, ఆమె భర్త కార్ల్ స్టెఫానోవిక్‌తో ట్రిప్‌కు వెళ్లినట్లు సమాచారం. నలుగురు కలిసి రాత్రి డిన్నర్ చేస్తున్న సమయంలో ఇదంతా జరిగినట్లు లోకల్ మీడియా వెల్లడించింది.
Man Married Minor Girl: అరేయ్ ఏంట్రా ఇది..? ఏపీలో మైనర్ బాలికకు పబ్లిక్‌గా తాళికట్టేశాడు..
ఈ వీడియో వైరల్ అవుతుండగా.. ఈ విషయమై జేడ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. క్వీన్స్‌లాండ్ పోలీసులు సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. క్లార్క్ తన వ్యక్తిగత జీవితంలో పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నాడు. 2007లో మోడల్ లారా బింగిల్‌తో క్లార్క్ డేటింగ్ చేశాడు. ఆ తరువాత వారిద్దరు విడిపోయారు. 2012లో కైలీ బోల్డిని వివాహం చేసుకున్నాడు. మూడేళ్ల తర్వాత ఈ జంటకు బిడ్డ జన్మించింది. అయితే 2020లో క్లార్క్, కైలీ విడాకులు తీసుకున్నారు.
⛔️Watch:
michael clarke karl stefanovic fight video.
karl stefanovic and michael clarke fight.
Michael Clarke and Stefanovic fight 🙈🤣
his girlfriend, and Karl Stefanovic at a public park in Noosa.
#MichaelClarke#leakedvideos #fight#jamespackerhttps://t.co/YzDBWZzzK1 pic.twitter.com/4LQn3zmDKJ— What_ever (@SoeverWhat) January 19, 2023