NTV Telugu Site icon

Nita Ambani-Rohit Sharma: అంతా ఓకేనా.. రోహిత్, నీతా అంబానీ సీరియస్‌ మీటింగ్!

Nita Ambani Rohit Sharma

Nita Ambani Rohit Sharma

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిన ముంబై.. డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఓడించి విజయంను ఖాతాలో వేసుకుంది. టీమ్ విజయం సాధించినా.. అభిమానులను మాత్రం ఓ విషయం ఆందోళన కలిగిస్తోంది. అది మరేదో కాదు.. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ఫామ్‌. ఐపీఎల్ 2025లో ఆడిన మూడు మ్యాచ్‌లలో హిట్‌మ్యాన్‌ 21 పరుగులు మాత్రమే చేశాడు. ఫాన్స్ మాత్రమే కాదు.. ముంబై ఫ్రాంచైజీ యజమాని నీతా అంబానీ కూడా ఆందోళన చెందుతున్నారు.

Also Read: SRH vs HCA: ఐపీఎల్ 2025 టిక్కెట్ల వ్యవహారం.. ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ విచారణ!

కేకేఆర్ మ్యాచ్ అనంతరం నీతా అంబానీ, రోహిత్ శర్మలు మైదనంలో మాట్లాడుకుంటూ కనిపించారు. ఆ సమయంలో నీతా కాస్త సీరియస్‌గా కనిపించారు. రోహిత్‌తో సీరియస్‌గా డిస్కస్ చేశారు. నీతా మాట్లాడుతుండగా.. రోహిత్ అలా చూస్తుండిపోయాడు.ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫొటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. నీతా, రోహిత్ ఏం అంశం గురించి మాట్లాడుకున్నారో తెలియదు కానీ.. హిట్‌మ్యాన్‌ ఫామ్‌పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ వీడియో, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీటిపై నెటిజెన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ‘రోహిత్ సరిగా ఆడడం లేదు.. అంతా ఓకేనా’, ‘రోహిత్.. ఏమైంది నీకు ఆడడం లేదు’ అంటూ కామెంట్స్ కురిపిస్తున్నారు.