Site icon NTV Telugu

డ్యుయల్ టోన్ ఎక్స్‌టీరియర్, BaaS ఆప్షన్‌తో MG Windsor EV Inspire ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా

Mg Windsor Ev Inspire Edition

Mg Windsor Ev Inspire Edition

MG Windsor EV Inspire: MG మోటార్ ఇండియా Windsor EV Inspire ఎడిషన్‌ను మార్కెట్‌లో లాంచ్ చేసింది. Windsor EV Inspire Edition కి డ్యుయల్ టోన్ ఎక్స్‌టీరియర్ ఉంది. దీనికి పర్ల్ వైట్, స్టార్‌రి బ్లాక్ కలర్ తో స్టైలిష్ లుక్ పెంచే రోస్ గోల్డ్ క్లాడింగ్‌తో అలాయ్ వీల్స్, బ్లాక్ ORVMs, Inspire బ్రాండింగ్ వచ్చాయి. అలాగే ఫ్రంట్ గ్రిల్, బంపర్ కార్నర్ ప్రొటెక్టర్స్ లో కూడా రోస్ గోల్డ్ ఎలిమెంట్స్ ఉన్న అక్సెసరీస్ ప్యాక్ ఇందులో భాగంగా ఉంటుంది.

Wins 53 Lakh Car: లక్కీ మేధాంశ్… రూ. 201 కూపన్ తో ఏకంగా.. టయోట ఫార్ట్యూనర్ కారు

ఇక ఇంటీరియర్‌లో సాంగ్రియా రెడ్ అండ్ బ్లాక్ లెదర్ అప్‌హోల్స్ట్రీ ఉంటుంది. హెడ్రెస్ట్‌ లపై Embroidered Inspire లోగో ఇంటీరియర్‌లో గోల్డ్ ఎసెంట్స్, ప్రత్యేక థీమ్ మ్యాట్స్, కుశన్లు, రియర్ విండో సన్‌షేడ్స్ అండ్ లెదర్ కీ కవర్ ఉన్నాయి. అలాగే ఎక్స్ట్రా ఆప్షన్స్‌లో స్కై లైట్ ఇన్ఫినిటీ వ్యూ గ్లాస్ రూఫ్, వైర్‌లెస్ ఇల్యూమినేటెడ్ సిల్ ప్లేట్స్ MG డీలర్‌షిప్‌ల వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ Inspire Edition 38 kWh బ్యాటరీ, పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రనస్ మోటార్ తో వస్తుంది. మోటార్ 134 bhp శక్తి, 200 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. MG ప్రకారం దీనిని పూర్తిగా చార్జ్ చేసిన తర్వాత వాహనం 331 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. DC ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం వాహన బ్యాటరీని సుమారు 40 నిమిషాల్లో 80% వరకు చార్జ్ చేయగలదు.

Janhvi Kapoor : అలాంటి సీన్లలో నటిస్తే తప్పేంటి.. జాన్వీకపూర్ షాకింగ్ కామెంట్స్

ఈ ప్రత్యేక ఎడిషన్ ప్రారంభ ధర రూ. 16.65 లక్షలు(ex-showroom) గా ఉంది. Battery-as-a-Service (BaaS) ఆప్షన్‌తో తీసుకునే వినియోగదారులు వాహనాన్ని రూ.9.99 లక్షలలో పొందవచ్చు. భారత్ లో కేవలం 300 యూనిట్లే లభ్యమయ్యే ఈ లిమిటెడ్ ఎడిషన్ ప్రత్యేకమైన విజువల్ అప్‌గ్రేడ్‌లతో వస్తుంది.

Exit mobile version