Meta Subscription Plans: మెటా సంచలన నిర్ణయం.. ఇక ఎఫ్బీ, ఇన్‌స్టా, వాట్సాప్‌కి నెలవారీ ఛార్జీలు.. ప్లాన్స్.. రేట్స్ ఇవే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meta Subscription Plans: సోషల్ మీడియా ప్రపంచంలో భారీ మార్పుకు శ్రీకారం చుడుతూ మెటా కీలక ప్రకటన చేసింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వినియోగదారుల కోసం కొత్త పెయిడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్లను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇప్పటివరకు పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉన్న ఈ ప్లాట్‌ఫారమ్‌లు, ఇకపై ప్రీమియం ఫీచర్ల కోసం నెలవారీ చెల్లింపులు కోరనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులతో పాటు భారతీయ యూజర్లకు కూడా ఈ ప్లాన్లు అందుబాటులోకి రానున్నాయి. మెటా ప్రవేశపెట్టిన “ప్లస్” వెర్షన్ ద్వారా వినియోగదారులు ప్రత్యేకమైన టూల్స్, అధునాతన కస్టమైజేషన్ ఫీచర్లు మరియు మెరుగైన యూజర్ అనుభవాన్ని పొందగలరని కంపెనీ తెలిపింది.
ప్రకటనలపై మాత్రమే ఆధారపడని మెటా
ఇప్పటి వరకు మెటా ప్రధానంగా ప్రకటనల ద్వారా ఆదాయం పొందేది. అయితే ఇప్పుడు కంపెనీ తన వ్యాపార వ్యూహాన్ని మార్చుకుంటోంది. ప్రకటనల ఆదాయంతో పాటు సబ్స్క్రిప్షన్ మోడల్ ద్వారా కూడా భారీగా ఆదాయం సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ప్రీమియం ఫీచర్ల కోసం వినియోగదారుల నుంచి నేరుగా నెలవారీ రుసుము వసూలు చేయాలని నిర్ణయించింది.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ప్లాన్ల ధరలు ఇవే
మెటా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇన్స్టాగ్రామ్ ప్లస్ మరియు ఫేస్బుక్ ప్లస్ ధర నెలకు 3.99 డాలర్లు అంటే సుమారుగా రూ. 387 కాగా.. వాట్సాప్ ప్లస్ ధర నెలకు 2.99 డాలర్లు అంటే దాదాపుగా రూ. 290గా ఉండనుంది.. అయితే, భారతదేశంలో ఖచ్చితమైన ధరలను మాత్రం కంపెనీ ఇంకా ప్రకటించలేదు.
వాట్సాప్ ప్లస్‌లో అదిరిపోయే ఫీచర్లు
టెక్‌క్రంచ్ నివేదిక ప్రకారం, వాట్సాప్ ప్లస్‌లో వ్యక్తిగతీకరణకు ప్రాధాన్యం ఇచ్చే అనేక ప్రత్యేక ఫీచర్లు అందుబాటులో ఉండనున్నాయి.. వీటిలో.. కస్టమ్ చాట్ థీమ్‌లు, ప్రత్యేక రింగ్టోన్లు, ప్రీమియం స్టిక్కర్లు, మరిన్ని చాట్లను పిన్ చేసుకునే అవకాశం వంటి సౌకర్యాలు ఉండనున్నాయి.
ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌కు ప్రీమియం అనుభవం
ఇన్స్టాగ్రామ్ ప్లస్ మరియు ఫేస్బుక్ ప్లస్ వినియోగదారులకు కూడా పలు ప్రత్యేక ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో.. స్టోరీలను ఎన్ని సార్లు చూశారో తెలుసుకునే అవకాశం, అపరిమిత “క్లోజ్ ఫ్రెండ్స్” జాబితాలు, వ్యూయర్స్ లిస్ట్‌లో కనిపించకుండా స్టోరీ ప్రివ్యూ చూడగలగడం.. 24 గంటలకంటే ఎక్కువసేపు స్టోరీలను ఉంచుకునే ఫీచర్.. వారానికి ఒక స్టోరీని బూస్ట్ చేసుకునే అవకాశం వంటి ప్రత్యేక సదుపాయాలు ఉండనున్నాయి. అంతేకాకుండా యూజర్లు తమ స్టోరీలను ఎవరు చూశారో సులభంగా శోధించగలిగే కొత్త ఫీచర్ కూడా అందుబాటులోకి రానుంది.
కస్టమ్ డిజైన్ ఫీచర్లు కూడా
మెటా ప్లస్ వినియోగదారుల కోసం ప్రత్యేక కాస్మెటిక్ అప్గ్రేడ్లను కూడా తీసుకొస్తోంది. వీటిలో.. యానిమేటెడ్ సూపర్ హార్ట్ రియాక్షన్లు, కస్టమ్ యాప్ ఐకాన్లు, బయోలకు ప్రత్యేక ఫాంట్లు, ఎక్కువ ప్రొఫైల్ పిన్లు వంటి ఫీచర్లు ఉన్నాయి.
మెటా వెరిఫైడ్‌కు భిన్నం
ఈ కొత్త ప్లాన్లు ఇప్పటికే అందుబాటులో ఉన్న “మెటా వెరిఫైడ్” సేవకు భిన్నమని కంపెనీ స్పష్టం చేసింది. మెటా వెరిఫైడ్ ప్రధానంగా ఐడెంటిటీ వెరిఫికేషన్ మరియు కస్టమర్ సపోర్ట్‌పై దృష్టి సారిస్తే, కొత్త ప్లస్ ప్లాన్లు ప్రీమియం యూజర్ అనుభవంపై దృష్టి పెడుతున్నాయి.
మెటా ఏఐ కోసం ప్రత్యేక ప్లాన్లు
సోషల్ మీడియా యాప్‌లతో పాటు మెటా తన ఏఐ సేవల కోసం కూడా కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. “మెటా వన్ ప్లస్” మరియు “మెటా వన్ ప్రీమియం” పేర్లతో రెండు కొత్త ప్లాన్లు అందుబాటులోకి రానున్నాయి. మెటా వన్ ప్లస్ ధర నెలకు 7.99 డాలర్లు అంటే సుమారుగా రూ. 775 కాగా.. మెటా వన్ ప్రీమియం ధర నెలకు 19.99 డాలర్లు అంటే దాదాపుగా రూ. 1,939గా ఉండనున్నాయి.. ఈ ప్లాన్ల ద్వారా యూజర్లు మెటా ఏఐను ఉపయోగించి ఇమేజ్‌లు, వీడియోలు సృష్టించడం, క్లిష్టమైన పనులను పూర్తి చేయడం వంటి సదుపాయాలు పొందగలరు.
క్రియేటర్లు, వ్యాపారాల కోసం కొత్త ప్లాన్లు
మెటా క్రియేటర్లు మరియు వ్యాపార వినియోగదారుల కోసం కూడా ప్రత్యేక సబ్స్క్రిప్షన్ ప్లాన్లను ప్రకటించింది. “మెటా వన్ ఎసెన్షియల్స్” మరియు “మెటా వన్ అడ్వాన్స్డ్” పేర్లతో ఈ ప్లాన్లు అందుబాటులోకి రానున్నాయి. మెటా వన్ ఎసెన్షియల్స్ ధర నెలకు 14.99 డాలర్లు (సుమారుగా రూ. 1,454). ఇది వెరిఫికేషన్ ప్రయోజనాలు, మెరుగైన ప్రమోషన్ టూల్స్ వంటి ఫీచర్లను అందిస్తుంది. ఇక మెటా వన్ అడ్వాన్స్డ్ ప్లాన్ ప్రత్యేకంగా ఇన్ఫ్లుయెన్సర్లు మరియు వ్యాపారాల కోసం రూపొందించబడింది. దీని ద్వారా సోషల్ మీడియా రీచ్ పెంచుకోవడం, ఫేస్బుక్ ఫీడ్‌లలో ప్రాధాన్యత పొందడం వంటి ప్రయోజనాలు లభిస్తాయి. మెటా తీసుకున్న ఈ నిర్ణయం సోషల్ మీడియా ప్రపంచంలో పెద్ద మార్పుకు నాంది పలికే అవకాశం ఉందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!