Merry Christmas : ఓటీటీలోకి వచ్చేస్తున్న మెర్రీ క్రిస్మస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా నటించిన బాలీవుడ్ సౌత్ ఇండియన్ సినిమా ‘మెర్రీ క్రిస్మస్’.ఈ మూవీ జనవరి 12న థియేటర్లలో రిలీజైంది.మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి అంధాదూన్ ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో విజయ్ సేతుపతి, కత్రినాకైఫ్ యాక్టింగ్‌తో పాటు శ్రీరామ్ రాఘవన్ టేకింగ్, విజువల్స్ మరియు బ్యాక్‌డ్రాప్‌పై ప్రశంసలు వచ్చాయి. కానీ సింపుల్ స్టోరీలైన్ కారణంగా కమర్షియల్ ఫెయిల్యూర్‌గా ఈ మూవీ నిలిచింది.శ్రీరామ్ రాఘవన్ మూవీస్‌కు ఉన్న క్రేజ్ కారణంగా ఈ మూవీ ఓటీటీ బిజినెస్ మాత్రం భారీ స్థాయిలో జరిగినట్లు సమాచారం. దాదాపు అరవై కోట్లకు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నది. యాభై కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ డిజిటల్ రైట్స్‌తోనే లాభాల్లోకి అడుగుపెట్టినట్లు సమాచారం.
సంక్రాంతి పోటీ కారణంగా థియేటర్లలో అనుకున్న స్థాయిలో ఈ మూవీ వసూళ్లను రాబట్టలేకపోయింది.ఈ మూవీ కేవలం 20 కోట్లలోపే వసూళ్లను దక్కించుకున్నది. ఫ్రెంచ్ నవల బర్డ్ ఇన్ ఏ కేజ్ ఆధారంగా దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ మెర్రీ క్రిస్మస్ మూవీని తెరకెక్కించాడు. డైరెక్టర్‌గా శ్రీరామ్ రాఘవన్ కెరీర్లో అత్యధిక ఐఎమ్‌డీబీ ర్యాంక్‌ను దక్కించుకున్న మూవీగా మెర్రీ క్రిస్మస్ నిలిచింది. థియేటర్లలో ఈ మూవీ హిందీతో పాటు తెలుగు మరియు తమిళ భాషల్లో రిలీజైంది. కానీ సంక్రాంతి పోటీ కారణంగా ఈ మూవీ రిలీజ్ అయిందనే విషయం తెలియకుండానే థియేటర్లలో నుంచి కనుమరుగైంది. మెర్రీ క్రిస్మస్ మూవీలో రాధికా ఆప్టే మరియు రాధికా శరత్ కుమార్ అతిథి పాత్రలను పోషించారు.ఇదిలా ఉంటే మెర్రీ క్రిస్మస్ మూవీ ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ బాలీవుడ్ మూవీ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్ ప్లాట్ ఫామ్ లో మార్చి 8న మెర్రీ క్రిస్మస్ ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. ఈ మూవీ హిందీతో పాటు తెలుగు మరియు తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.త్వరలోనే దీనికి సంబంధించి నెట్ ఫ్లిక్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వనున్నట్లు సమాచారం.
Also Read
- Astrology: సెప్టెంబర్ 29 మంగళవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అనుకోని గుడ్‌న్యూస్..
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
తాజావార్తలు
-
DTTTMovie : యంగ్ టైగర్ వస్తున్నాడు.. టికెట్స్ కోసం భారీ డిమాండ్
-
Astrology: సెప్టెంబర్ 29 మంగళవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అనుకోని గుడ్‌న్యూస్..
-
Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!